Share News

పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..

ABN , Publish Date - Feb 05 , 2026 | 08:51 AM

ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో విశాఖకు చెందిన పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి కె.శ్రీనివాసరావు నివాసాల్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి ప్రాంతంలో ఏకకాలంలో ఈ దాడులు జరుగుతున్నాయి.

పంచాయతీరాజ్ ఉద్యోగి ఆస్తులపై ఏసీబీ రైడ్స్.. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సోదాలు..
ACB Raids

విశాఖపట్నం, ఫిబ్రవరి5 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో విశాఖలో పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి కె.శ్రీనివాసరావు నివాసాల్లో ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) అధికారులు గురువారం విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలు విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతాలతో పాటూ హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి ప్రాంతంలో ఒకేసారి కొనసాగుతున్నాయి.


ఏక కాలంలో సోదాలు..

ముందస్తు సమాచారం ఆధారంగా ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం నుంచి ఒకేసారి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, మధురవాడ, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా సహా హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి ప్రాంతాల్లో శ్రీనివాసరావుకు చెందిన ఇళ్లు, బంధువుల నివాసాలు, అనుబంధ ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.


ఆస్తులపై అనుమానాలు..

పంచాయతీరాజ్ శాఖలో పనిచేసిన సమయంలో శ్రీనివాసరావు ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీకి ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనపై కేసు నమోదు చేసి సోదాలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమికంగా స్థిరాస్తులు, బ్యాంక్ డిపాజిట్లు, బంగారం, నగదు, విలువైన పత్రాలు వంటి అంశాలపై అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.


హైదరాబాద్ శేరిలింగంపల్లిలో సోదాలు..

శ్రీనివాసరావుకు హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి ప్రాంతంలోనూ నివాస భవనం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు సోదాలు నిర్వహించిన అధికారులు.. బ్యాంక్ లావాదేవీలు, పెట్టుబడుల వివరాలను సేకరిస్తున్నారు. సోదాలు పూర్తైన తర్వాత.. ఆయన ఆస్తి వివరాలపై అధికారిక ప్రకటన విడుదల చేయడం సహా తదుపరి చర్యలు చేపట్టే అవకాశముంది. ఏసీబీ సోదాలతో విశాఖ, మధురవాడ ప్రాంతాల్లో స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. పంచాయతీరాజ్ శాఖకు చెందిన విశ్రాంత ఉద్యోగిపై ఇంత పెద్ద స్థాయిలో సోదాలు జరగడంపై చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

గ్లోబల్ వేదికపై భారత్ స్థానం మరింత బలోపేతం: పవన్ కల్యాణ్

ఏసీబీ రైడ్స్.. సచివాలయ అడ్మిన్ గుట్టు రట్టు

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 05 , 2026 | 10:09 AM