YSRCP Activist Arrest: గర్భిణిపై దాడి ఘటన.. వైసీపీ కార్యకర్తకు తగిన బుద్ధి చెప్పిన పోలీసులు
ABN , Publish Date - Dec 23 , 2025 | 03:51 PM
జగన్ పుట్టినరోజు సందర్భంగా ఓ గర్భిణి పట్ల దారుణంగా ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తకు పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. వైసీపీ కార్యకర్త అజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా , డిసెంబర్ 23: జిల్లాలోని కదిరిలో ఓ గర్భిణి పట్ల దారుణంగా ప్రవర్తించిన వైసీపీ కార్యకర్తలకు పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా కదిరిలో వైసీపీ శ్రేణులు వికృతచేష్టలకు పాల్పడ్డారు. తనకల్లు మండలం ముత్యాలవారి పల్లిలో వైసీపీ కార్యకర్త అజయ్ దేవా.. నిండు గర్భిణీ సంధ్యారాణి గొంతు నులిమి కాలితో తన్నాడు. ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ కార్యకర్త అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోగా.. మరో కార్యకర్త అంజన్నప్ప పరారీలో ఉన్నాడు.
ఇకపై భవిష్యత్తులో మరో మహిళపై ఇటువంటి దాడులకు మరెవరూ పాల్పడకుండా ఉండేలా నిందితుడు అజయ్ దేవాను కదిరి పట్టణం నడిబొడ్డున పోలీసులు ఊరేగించారు. కదిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి రూరల్ పోలీస్ స్టేషన్ వరకు ఊరేగించారు. మహిళ గర్భంలోని శిశువును చంపాలని ఉద్దేశంతోనే వైసీపీ కార్యకర్తలు దాడులు చేశారని పోలీసులు తెలిపారు. టపాసులు పక్కకు వెళ్లి కాల్చుకోవాలని సూచించిన మహిళపై వైసీపీ కార్యకర్తలు అజయ్, అంజినప్పలు దాడి చేశారని చెప్పారు.
అజయ్ దేవాను అరెస్టు చేసిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న వైసీపీ కార్యకర్త అంజనప్ప కోసం కదిరి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గర్భిణీ స్త్రీపై దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్త అజయ్‌పై పోలీసుల వ్యవహరించిన తీరు పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
పీపీపీ విధానం లక్ష్యం అదే: మంత్రి సత్యకుమార్
మంత్రి కుమారుడిపై లైంగిక ఆరోపణల కేసు.. అసలు నిజం ఇదీ
Read Latest AP News And Telugu News