Minister Son Case: మంత్రి కుమారుడిపై లైంగిక ఆరోపణల కేసు.. అసలు నిజం ఇదీ
ABN , Publish Date - Dec 23 , 2025 | 02:37 PM
మంత్రి సంధ్యారాణి కుమారుడు, పీఏపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో అసలు నిజాలను పోలీసులు బయటపెట్టారు.
మన్యం, డిసెంబర్ 23: మంత్రి సంధ్యారాణి (Minister Sandhay Rani) కుమారుడు పృథ్వి, మంత్రి పీఏపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఫిర్యాదుదారు త్రివేణి, ఆమెకు సహకరించిన దేవిప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. ఇటీవల త్రివేణి అనే మహిళ.. తనను మంత్రి కుమారుడు పృథ్వి, అలాగే మంత్రి పీఏ లైంగికంగా వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయయం తెలిసిందే. ఈ ఘటన రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అసలు నిజాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మంత్రి కుమారుడిపై సదరు మహిళ కావాలనే ఫిర్యాదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా దేవి ప్రసాద్ అనే వ్యక్తి సహకారంతో త్రివేణి అనే మహిళ ఫేక్ మెసేజ్‌లను సృష్టించారని తేల్చారు. దీంతో నిందితులు త్రివేణి, దేవి ప్రసాద్‌లను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ మాధవ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో మళ్లీ అదే సక్సెస్ ఫార్ములా.. క్వాంటం, ఏఐపై సీబీఎన్ ప్లాన్ ఇదే
పీపీపీ విధానం లక్ష్యం అదే: మంత్రి సత్యకుమార్
Read Latest AP News And Telugu News