Ananthapuram News: హిందూపురంలో కర్ణాటక వాసి హత్య
ABN , Publish Date - Dec 26 , 2025 | 01:28 PM
హిందూపురం పట్టణంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.మహిపాల్ అనే వ్యక్తి హిందూపురంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే... అతడిని ఆటోలో వచ్చిన కొందరు అతడిని చితకబాదడంతో తీవ్రగాయాలపాలై మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.
హిందూపురం(అనంతపురం): సెల్‌ఫోన్ చోరీ చేశాడని అనుమానంతో హిందూపురం పట్టణంలోని బెడ్డింగ్ సెంటర్ వద్ద వ్యక్తిని గురువారం రాత్రి హత్య చేశారు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక(Karnataka) రాష్ట్రం తుమకూరు జిల్లా క్యాతగుండనహళ్లికి చెందిన మహిపాల్(44) కొన్ని రోజులుగా పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో గల కామన్ బెడ్డింగ్ సెంటర్‌లో రాత్రిపూట ఉంటూ, పగటిపూట ట్రాక్టర్ డ్రైవర్‌గా వెళ్తుండేవాడు. గురువారం ఎప్పటిలాగే ఉదయం బెడ్డింగ్ సెంటర్ నుంచి పనికోసం చిన్న మార్కెట్‌కి వెళ్లాడు.
కొద్దిసేపటికి అక్కడికి ఐదుగురు ఆటోలో వచ్చి మహిపాల్‌ను తీసుకెళ్లారు. పగలంతా ఆటోలోనే తిప్పుతూ చితకబాదారు. సాయంత్రం బెడ్డింగ్ సెంటర్‌కు తీసుకెళ్లి అక్కడ కూడా విచక్షణా రహితంగా కొట్టడంతో మృతిచెందాడు. అక్కడి షాపులవారు వనట్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ముగ్గురూ పరారయ్యారు. మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హత్యచేసిన వారు కూడా కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరుకు చెందిన వారుగా తెలుస్తోంది. సెల్‌ఫోన్ కోసమే కొట్టి చంపారా, ఇతర కారణాలతో హత్య చేశారా.. అనేది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు పుట్టపర్తి నుంచి డాగ్ స్క్వాడ్‌ను రప్పిస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడు తెలిపారు. మృతుడి కటుంబ సభ్యులు వచ్చి ఫిర్యాదు చేశాక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలిస్తామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News