Home » Andhrapradesh
కడప అంటే ఇప్పటి దాకా కళలకు కాణాచి. చారిత్రక కట్టడాలకు ప్రసిద్ధి. తిరుమల తిరుపతి(Tirumala Tirupati) తొలి గడప దేవునికడప ఇక్కడే ఉంది. తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య, సామాజిక దురాగాతాలపై గళమెత్తిన వేమన, కాలజ్ఞానం బోధించిన వీరబ్రహ్మం ఇక్కడి వారే.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమైనాయి. ఆ క్రమంలో 2024-25 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి బడ్జెట్పై స్పందించారు.
Andhrapradesh: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీశైలం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో సీఎంకు స్వాగతం పలికారు. విజయవాడ నుంచి సీ ప్లెయిన్లో సీఎం శ్రీశైలంకు చేరుకుని అక్కడి నుంచి రోప్ వే ద్వారా కొండపైకి వచ్చారు.
Adhrapradesh: హిట్లర్ లాంటి వారే దిక్కూమొక్కు లేకుండా చనిపోయారని.. అలాంటి పరిస్థితే టీడీపీ పెద్దలకు కూడా వస్తుందని వైసీపీ నేత లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల కష్టసుఖాలను పట్టించుకోకుండా జనం మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా వలనే చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి బయటపడుతోందన్నారు.
మండలంలోని కురుగుంట పంచాయతీ పరిధిలోని వైఎస్సార్ కాలనీ అధ్వానంగా తయారైంది. కాలనీలో ఇళ్ల మధ్య, రోడ్లపై పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. దీంతో విషసర్పాలు సంచరిస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పారిశుధ్య నిర్వాహణ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
గత ఐదేళ్ల వైసీపీ హయాంలో తట్టెడు మట్టి కూడా రోడ్లపై వేయనిదుస్థితి ఉండేదని, అదే కూటమి ప్రభుత్వంలో గుంతల రోడ్లకు మోక్షం లభించిం దని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని కనగానపల్లిలో శనివారం ప్రారంభించారు. స్థానిక పండమేరు వంక వద్ద ఉన్న గతుకుల రోడ్లను చదును చేసి, తారు రోడ్డు నిర్మించే పనులను ఆర్అండ్బీ అధికారుల తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో బుధవారం నుంచి మూడు రోజులపాటు (25వ తేదీ వరకు) పలు రైళ్లు రద్దు చేసినట్టు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం కె.సందీప్(Waltheru Division Senior DCM K. Sandeep) తెలిపారు.
ఈనెల 16, 17 తేదీలలో జిల్లాలో భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వాతావరణం బాగుంటే సెలవులను రద్దు చేస్తామన్నారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో నైరుతి బంగాళాఖాతంలో సోమవారానికి అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పీలేరు మండలంలోని ఫ్రీ హోల్డ్ భూముల ఫైళ్ల పరిశీలనను ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని పీలే రు మండల ప్రత్యేక అధికారి రమ పేర్కొ న్నారు.