మిర్చియార్డు నూతన పాలకవర్గం నియామకం
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:56 PM
గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ(మిర్చియార్డు) నూతన పాలకవర్గం నియామకం పూర్తి అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదంతో రాష్ట్ర వ్యవసాయ, సహకార(మార్కెటింగ్) శాఖ సోమవారం అధికారికంగా జీవో నంబరు 89ని విడుదల చేసింది.
చైర్మన్‌గా కుర్రా అప్పారావు
అధికారికంగా వెలువడిన ఉత్తర్వులు
20న ప్రమాణ స్వీకారం
గుంటూరు: గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ(మిర్చియార్డు) నూతన పాలకవర్గం నియామకం పూర్తి అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదంతో రాష్ట్ర వ్యవసాయ, సహకార(మార్కెటింగ్) శాఖ సోమవారం అధికారికంగా జీవో నంబరు 89ని విడుదల చేసింది. కమిటీకి గౌరవ చెర్‌పర్సన్‌గా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి, చైర్మన్‌గా కుర్రా అప్పారావు, వైస్ చైర్‌పర్సన్‌గా బిట్రగుంట మల్లికని నియమించింది. సభ్యులుగా కొనకళ్ల వెంకట సత్యన్నారాయణ, ముడావత్ మంగాబాయి,
మొహమ్మద్ హఫీజ్, మేళం సైదయ్య, షేక్ ఖాదర్ బీ, బత్తుల జాన్ సైదా, దర్శనపు విజయమ్మ, ఇమ్మడి వెంకటలక్ష్మి, డాకుమళ్ల భాగ్యారావు, కుత్తూరు శ్రావణ కుమారి, కటకంశెట్టి విజయలక్ష్మి, చంద్రగిరిబాబు, నక్కల వంశీకృష్ణ, డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, పశు సంవర్ధక శాఖ ఏడీ, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, జిల్లా అగ్రి ట్రేడ్, మార్కెటింగ్ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ పదవీకాలాన్ని ప్రాథమికంగా ఏడాది పాటు పేర్కొంటూ మార్కెటింగ్ శాఖ ఎక్స్ అఫీషియో స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.
20న ప్రమాణ స్వీకారం
మిర్చియార్డు పాలకవర్గం నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలవడిన నేపథ్యంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని చైర్మన్‌గా నియామకం పొందిన కుర్రా అప్పారావు నిర్ణయించారు. ఈ నెల 20న గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని చేబ్రోలు హనుమయ్య గ్రౌండ్స్‌లో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు.
కూటమి ఐక్యత చాటిచెప్పేలా..
ఎన్‌డీఏ కూటమి ఐక్యతని చాటి చెప్పేలా మిర్చి యార్డు పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఉంటుందని మూడు పార్టీల నేతలు తెలిపారు. కమిటీలో దామాషా ప్రకారం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు పదవులు కేటాయించారు. చైర్మన్ సీటుని తెలుగుదేశం పార్టీకి కేటాయించగా వైస్ చైర్‌పర్సన్ పదవిని జనసేనకు ఇచ్చారు. అలానే డైరెక్టర్ పదవుల్లో బీజేపీకి సముచిత స్థానం కల్పించారు. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారం రోజున భారీ ఎత్తున ర్యాలీలు కూడా గుంటూరు నగరంలో నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
చంద్రబాబుతోనే మల్బరీకి పూర్వవైభవం
Read Latest Telangana News and National News