అమరావతిలో 41 కంపెనీలు
ABN , Publish Date - Feb 10 , 2026 | 01:28 PM
రాజధాని అమరావతిలో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. సోమవారం జరిగిన మంత్రులు- కార్యదర్శుల మూడో సమావేశంలో దీనిని స్పష్టం చేసింది.
రూ.48,711 కోట్ల పెట్టుబడులు
41,625 మందికి ఉద్యోగ అవకాశాలు
ఎంఓయూలు.. ఎస్‌ఐపీబీ ఆమోదం పూర్తి
రాజధానిలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం!
4,500 ఎకరాల్లో రూ.4,700 కోట్లతో నిర్మాణం
మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో నివేదిక
మంగళగిరి(గుంటూరు): రాజధాని అమరావతిలో పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. సోమవారం జరిగిన మంత్రులు- కార్యదర్శుల మూడో సమావేశంలో దీనిని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన నివేదికలో రాజధాని అమరావతిలో పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పన అంశాలపై ప్రభుత్వ కృషిని వివరించారు.
అమరావతిలో 41 కంపెనీలు రాబోతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఆయా కంపెనీలు రూ. 48,711 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నాయి. 41,625 మందికి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయని నివేదిక చెబుతోంది. ఇప్పటికే మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండిగ్స్(ఎంఓయూ)లు పూర్తయిపోయాయి. పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక బోర్డు(ఎస్‌ఐపీబీ) ఆమోద ముద్ర కూడా వేసిందని నిదేదిక పేర్కొంది.

రూ.4,700 కోట్లతో విమానాశ్రయం
రాజధాని అమరావతిలో రూ.4,700 కోట్లతో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 4,500 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి భూ సమీకరణ ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. కాగా అమరావతిలో ఇప్పటి వరకూ 9 జాబ్ మేళాలు నిర్వహించారు. తాడికొండ నియోజకవర్గంలో 7 జాబ్‌మేళాలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకోగా మొత్తం 9 జాబ్ మేళాలు నిర్వహించారు. వీటిలో 580 కంపెనీలు పాల్గొన్నాయి. వీటి ద్వారా 5,984 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినట్లు నివేదిక తెలుపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి.
చంద్రబాబుతోనే మల్బరీకి పూర్వవైభవం
Read Latest Telangana News and National News