మా ఆయన ఏమయ్యాడు..?
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:13 AM
మా ఆయన ఏమయ్యాడు.. పోలీసులు తీసుకెళ్లి మూడురోజులైంది.. ఏమయ్యాడో, ఎక్కడున్నాడో అంటూ.. ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఎస్పీ బంగ్లా వద్ద ఆయన కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. ఇందుకు సంబంధించిందిన వివరాలిలా ఉన్నాయి.
- పోలీసులు తీసుకెళ్లి మూడు రోజులైంది
- ఎస్పీ బంగ్లా వద్ద మహిళ ఆందోళన
అనంతపురం: ‘వాకింగ్‌కు వెళ్లిన నా భర్తను పోలీసులు తీసుకెళ్లి మూడు రోజులైంది. పిల్లలు ఏడుస్తున్నారు. ఏం సమాధానం చెప్పాలి?’ అని టమోటా మండీ మేనేజర్ రాజేంద్రనాయుడు భార్య దుర్గా భవాని(Durga Bhavani) కన్నీటి పర్యంతమయ్యారు. తన పిల్లలు, బంధువులతో కలిసి ఆమె బుధవారం సాయంత్రం ఎస్పీ బంగ్లా వద్ద ధర్నాకు దిగారు. తమది పశ్చిమగోదావరి జిల్లా తణుకు అని, 12 ఏళ్ల కిందట అనంతపురం వచ్చామని ఆమె అన్నారు.

తన భర్త జీఎన్‌ఆర్ మండీలో మేనేజర్‌గా పనిచేస్తున్నారని, సోమవారం వాకింగ్‌కు వెళ్లినప్పుడు పోలీసులు తీసుకెళ్లారని తెలిపారు. ఆయన ఏమయ్యాడో పోలీసులు చెప్పడం లేదని, ఎందుకు తీసుకెళ్లారో చెప్పాలని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు అక్కడికి చేరుకుని, ఆందోళన విరమించాలని వారిని కోరారు. రాజేంద్ర ఇంటికి వస్తాడని, ఇంటికి వెళ్లాలని ఆయన హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించి, వెళ్లిపోయారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పెంపుడు కుక్కకు.. మేడారంలో తులాభారం! క్షమాపణలు చెప్పిన.. హీరోయిన్
పాలిచ్చే పశువులకు చికెన్, మటన్ వ్యర్థాలు!
Read Latest Telangana News and National News