13 నెలల చిన్నారి అపహరణ
ABN , Publish Date - Jan 22 , 2026 | 11:49 AM
13 చిన్నారి అపహరణకు గురైన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే.. ఆ చిన్నారిని పొరుగింటి వారే అపహరించినట్లు గుర్తించారు. ప్రస్తుతం చిన్నారి సురక్షితంగా ఉందని, త్వరలోనే తీసుకొస్తామని పోలీసులు తెలుపుతున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- పొరుగువారే కిడ్నాపర్లు
తిరుపతి: పదమూడు నెలల చిన్నారిని పొరుగు వారే అపహరించిన ఘటన తిరుపతి(Tirupati)లో బుధవారం చోటుచేసుకుంది.ఈస్ట్ సీఐ శ్రీనివాసులు కథనం మేరకు... శ్రీకాళహస్తి(Srikalahasti)కి చెందిన మస్తాన్, సుచిత్ర దంపతులు ఉపాధి నిమిత్తం మూడు నెలల క్రితం తిరుపతికి వచ్చారు. చింతలచేను ప్రాంతంలో ఓ చిన్న గదిలో నివాసం వుంటూ వాడి పడేసిన వాటర్ బాటిళ్లు ఏరుకుని విక్రయించి జీవనం సాగిస్తున్నారు. వారికి జయశ్రీ అనే పది నెలల పాప ఉంది.
మస్తాన్ వుంటున్న గది పక్కనే మరో గదిలో తమిళనాడుకు చెందిన భార్యాభర్తలు మురుగన్ అలియాస్ కందన్, మారెమ్మ నివాసం ఉంటున్నారు. వీరుకూడా వ్యర్థపదార్థాల వ్యాపారమే చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు జయశ్రీతో ప్రేమగా వుంటూ ఆడించేవారు. బుధవారం ఉదయం జయశ్రీని మారెమ్మ తీసుకెళ్లింది.ఇంటి పనులు ముగిశాక పాపను తెచ్చుకునేందుకు చూడగా మురుగన్, మారెమ్మ కనిపించలేదు. బయటకు వెళ్లారేమో అని చాలాసేపు ఎదురు చూసి ఎంతసేపటికీ రాకపోవడంతో వారి సెల్‌ఫోన్లకు ఫోన్ చేయగా అవి స్విచ్‌ఆ్‌ఫ చేసి ఉన్నాయి.
దీంతో అనుమానం వచ్చిన మస్తాన్, సుచిత్ర మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. చిన్నారి జయశ్రీని మురుగన్, మారెమ్మ ఉదయం 10.30 గంటలకు టీవీఎస్ స్కూటీపై తీసుకెళ్లినట్లు సీసీ ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో మురుగన్, మారెమ్మ వేలూరు కాంచీపురం ప్రాంతానికి చెందినవారని పోలీసులు నిర్థారించారు.
మారెమ్మకు మురుగన్ నాల్గవ భర్త అని గుర్తించిన పోలీసులు ఆమె మునుపటి భర్తలు, వారి పిల్లలతో ఫోన్‌లో మాట్లాడగా.. ఆమెతో ఎటువంటి సంబంధం లేదని వారు చెప్పినట్టు తెలిసింది. మురుగన్, మారెమ్మ ప్రస్తుత జాడ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు తమిళనాడు కాంచీపురం చేరుకున్నాయి. త్వరలోనే జయశ్రీని సురక్షితంగా తీసుకొస్తామని సీఐ శ్రీనివాసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పెంపుడు కుక్కకు.. మేడారంలో తులాభారం! క్షమాపణలు చెప్పిన.. హీరోయిన్
పాలిచ్చే పశువులకు చికెన్, మటన్ వ్యర్థాలు!
Read Latest Telangana News and National News