Share News

చిరుత దాడి.. రెండు మేకలు మృతి

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:58 PM

మండలంలోని చిగతుర్పి గ్రామంలో లింగప్పకు చెందిన రెండు మేకలు చిరుతదాడిలో మృతిచెందాయి. బాధితుడు లింగప్ప ఇంటివద్ద కట్టేసిన మేకలపై ఆదివారం రాత్రి చిరుత దాడి చేసి చంపింది.

చిరుత దాడి.. రెండు మేకలు మృతి

గుడిబండ(అనంతపురం): మండలంలోని చిగతుర్పి గ్రామంలో లింగప్పకు చెందిన రెండు మేకలు చిరుతదాడిలో మృతిచెందాయి. బాధితుడు లింగప్ప ఇంటివద్ద కట్టేసిన మేకలపై ఆదివారం రాత్రి చిరుత దాడి చేసి చంపింది. దీంతో రూ.20వేలు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ఫారెస్ట్‌ అధికారులు గ్రామానికి చేరుకుని మేకల కళేబరాలను పరిశీలించారు. అనంతరం పశువైద్యాధికారులతో పోస్ట్‌మార్టం నిర్వహించారు. కార్యక్రమంలో ఫారెస్ట్‌ అధికారులు సంజీవరాయుడు, షౌకత్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.


pandu4.2.jpgఈ వార్తలు కూడా చదవండి:

నా వ్యక్తిగత జీవితాన్ని వివాద వస్తువుగా మార్చొద్దు!

ఆ 5 పంచాయతీలను తెలంగాణలో కలపండి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 17 , 2026 | 12:58 PM