Home » Leopard
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం, కుందుర్పి మండలాల్లో చిరుతపులుల సంచారంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. కళ్యాణదుర్గం మండల కేంద్రానికి ఓ గ్రానైట్ కొండపై, అలాగే కుందుర్పి మండలం రుద్రంపల్లిలో చిరుతపులులు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. వివరాలిలా ఉన్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో చిరుత కనిపించిందని ప్రజలు చెబుతున్నారు.
మహారాష్ట్రలోని భండారా జిల్లా ధనోరి గ్రామం సమీపంలోని గోసిఖుర్డ్ ఆనకట్టు కాలువలో తీవ్రంగా గాయపడి ఉన్న పులిని చూసి గ్రామస్థులు అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. పెద్ద పులిని సురక్షితంగా తరలించి చికిత్స అందించేందుకు పశువైద్య సిబ్బంది రంగంలోకి దిగింది.
ఎన్వీయూలో మరోసారి చిరుత సంచారంతో సిబ్బంది, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. గత రాత్రి ఎస్వీయూలోని కోళ్ల గూడుపై చిరుత దాడి చేసింది.
చెరుకు తోటల కారణంగా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్లలోని చిరుత పులులు పూర్తి స్థాయిలో మార్పును సంతరించుకున్నాయి. ‘చెరుకుతోటల చిరుత పులులు’ అన్న కొత్త జాతి మొదలైంది. ఈ జాతి కేవలం చెరుకు తోటల్లో మాత్రమే బతకగలదు.
శ్రీనివాసమంగాపురం నుంచి తిరుమలకు కాలినడకన వెళ్లే శ్రీవారిమెట్టు మార్గంలో చిరుత సంచారంతో కలకలం రేగింది. శుక్రవారం ఉదయం 150వ మెట్టు వద్ద అటవీ ప్రాంతంలోకి చిరుత దాటుతుండగా భక్తులు చూసి భయాందోళనకు గురై కేకలు వేయడంతో పారిపోయింది.
గొర్రెల యజమాని మేడిపల్లి రామయ్య సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాడి చేసిన జంతువు పాదముద్రలు గుర్తించి చిరుతపులిగా నిర్ధారించారు.
రాయచూరు తాలూకాలోని డొంగరాంపూర్ గుట్ట పై సోమవారం మరో సారి చిరుత సంచారం కనిపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. డొంగరాంపూర్ మామిడిదొడ్డి మద్యగల పొలంలో కుక్కపై దాడి చేసి చంపి వేయడంతో చిరుత సంచరిస్తున్న విషయం బయటికి పొక్కింది.
అదిగో చిరుత, ఇదిగో చిరుతలు ఉన్నాయంటూ అలిరెడ్డిపల్లె, వేంపల్లె రైతులు భయాందోళన చెందుతున్నారు. వేంపల్లె మండల పరిధిలోని పాపాఘ్ని నది అవతలున్న అలిరెడ్డిపల్లె సమీపంలోని ఎద్దలకొండ వెనుకవైపున అలిరెడ్డిపల్లె, వేంపల్లెకు చెందిన రైతులకు పొలాలు ఉన్నాయి.
Leopard Spotted: హైదరాబాద్లో చిరుత సంచారం కలకలం రేపింది. తెల్లవారుజామున గోల్కొండ ఇబ్రహీం బాగ్ మిలటరీ ప్రాంతంలో చిరుత రోడ్డు దాటుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.