దారి మార్చిన పెద్దపులి.. బసంతపూర్‌లో లేగదూడపై దాడి
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:05 PM
సంగారెడ్డి జిల్లా జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తుందన్న వార్తలతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తముతోంది. బసంతపూర్‌లో లేగదూడపై పులి దాడిచేసినట్లు గుర్తించారు. దీంతో ఇక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండాపోతోంది.
శ్రీనివాసపురం వైపు కదులుతున్న వైనం..
పాదముద్రల గుర్తింపు.. ఆందోళనలో ప్రజలు
జగదేవ్‌పూర్(సంగారెడ్డి): జగదేవ్‌పూర్ మండలం దౌలాపూర్ అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన పెద్దపులి వరుస గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఈ పులి యాదాద్రి భువనగిరి(Yadadri Bhuvanagiri) జిల్లా రాజపేట మండలం బసంతపూర్ సమీపంలో ఓ లేగదూడపై దాడి చేసి చంపేసినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు,
తాజాగా జనగామ జిల్లా ఆలేరు మండలం శ్రీనివాసపురం(Srinivasapuram) గ్రామ పరిసరాల వైపు పులి వెళ్లినట్లు పాదముద్రల ఆధారంగా గుర్తించారు. ఘటనా స్థలాల్లో అటవీ శాఖ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. పులి ప్రయాణించే మార్గాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. పులి సంచారం కారణంగా సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
థియేటర్లపై.. సినిమాల దండయాత్ర! తెలుగులోనే డజన్.. ఎలా చూడాల్రా నాయనా
Read Latest Telangana News and National News