ఎస్వీయూలో చిరుత సంచారం..
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:52 PM
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిసరాల్లో చిరుతపులి సంచరిచినట్లు గుర్తించారు. యూనివర్సిటీలోని యూనియన్ బ్యాంక్ వద్ద గత ఐదురోజులక్రితం చిరుత సంచరించిన విషయం అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైంది. అంతేగాక అక్కడి పరిసరాల్లో ఓ జింకను కూడా వేటాడినట్లు గుర్తించారు.
- కుక్క, జింక మాయం
తిరుపతి: ఎస్వీ యూనివర్సిటీలోని యూనియన్ బ్యాంక్ వద్ద సంక్రాంతి పండుగనాడు రాత్రి 12.50 నుంచీ 1.05 గంటల వరకూ చిరుత సంచరించింది. అక్కడున్న ఒక కుక్కను నోట కరుచుకొని వెళ్ళిపోయింది. అంతకు మునుపే పాపులేషన్ స్టడీస్ బిల్డింగు సమీపంలో ఒక జింకను చిరుత చంపినట్టు ఆధారాలు లభించాయి. జింకను చంపి తిన్న చిరుత సగం కళేబరాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఇదంతా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయింది.

అటవీశాఖ అధికారులకు యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది సమాచారాన్ని చేరవేయడంతో వారక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ప్రాంతంలో ట్రాప్ కెమరాలు ఏర్పాటు చేసి సిబ్బందిని బీట్‌కు కేటాయించారు.విద్యార్థులను కూడా అప్రమత్తం చేసినట్టు వర్సిటీ సెక్యూరిటీ అధికారి మోహన్ నాయుడు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి.
పెంపుడు కుక్కకు.. మేడారంలో తులాభారం! క్షమాపణలు చెప్పిన.. హీరోయిన్
పాలిచ్చే పశువులకు చికెన్, మటన్ వ్యర్థాలు!
Read Latest Telangana News and National News