Share News

Leopard: ‘అదానీ’ సమీపంలో చిరుత సంచారం

ABN , Publish Date - Jan 09 , 2026 | 10:17 AM

చిరుత సంచారం స్థానికుల్లో భయాందోళన కల్పిస్తోంది. అదానీ సిమెంట్‌ పరిశ్రమ మైనింగ్‌ ప్రాంతంలో చిరుతపులి తిరుగుతున్నట్లు గుర్తించారు. అలాగే.. రోళ్ల మండలంలో కూడా చిరుత పులి సంచారం ఉన్నట్లు తెలుస్తోంది.

Leopard: ‘అదానీ’ సమీపంలో చిరుత సంచారం

తాడిపత్రి(అనంతపురం): మండలంలోని తలారిచెరువు అదానీ సిమెంట్‌ పరిశ్రమ మైనింగ్‌ ప్రాంతంలో బుధవారం రాత్రి చిరుతపులి(Leopard) కనిపించింది. భయబ్రాంతులకు గురైన సిమెంట్‌ పరిశ్రమ సిబ్బంది వెంటనే రూరల్‌ సీఐ శివగంగాధర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన సిబ్బందితో కలిసి వెళ్లి మైనింగ్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు కూడా ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కానీ చిరుతపులి కనిపించలేదు. పరిశ్రమ చుట్టుపక్కల గ్రామాలైన ఊరుచింతల, తలారిచెరువు, ఉమ్మాయిపల్లి తదితర గ్రామస్థులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.


pandu1.2.jfif

ఆవును చంపిన చిరుత

రొళ్ల(అనంతపురం): మండలంలోని వట్టేబెట్ట సమీప కొండ ప్రాంతంలో రైతు ప్రకాశ్‌కు చెందిన ఆవును బుధవారం చిరుత చంపింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. రైతు ఫిర్యాదు మేరకు ఫారెస్ట్‌ అధికారులు ఆవు కళేబరానికి పోస్ట్‌మార్టం చేయించి, పూడ్చి వేయించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ఇక షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్‌

శాప్‌కు 60.76 కోట్లు.. కేంద్ర క్రీడా శాఖ కేటాయింపు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 09 , 2026 | 10:17 AM