Share News

accidents రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు

ABN , Publish Date - Feb 17 , 2026 | 12:43 AM

హిందూపురం - లేపాక్షి రహదారిలోని శ్రీకంఠపురం కట్టమీద సోమ వారం ఆటో బోల్తాపడి ఐదుగురికి గాయాలయ్యాయి. హిం దూపురం అప్‌గ్రేడ్‌ సీఐ ఆంజనేయులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.

accidents రోడ్డు ప్రమాదాల్లో పలువురికి గాయాలు

హిందూపురం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): హిందూపురం - లేపాక్షి రహదారిలోని శ్రీకంఠపురం కట్టమీద సోమ వారం ఆటో బోల్తాపడి ఐదుగురికి గాయాలయ్యాయి. హిం దూపురం అప్‌గ్రేడ్‌ సీఐ ఆంజనేయులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.


అనంతపురం నగరానికి చెందిన ఓ కుటుంబం లేపాక్షి ఆలయానికి వచ్చి తిరుగు ప్రయాణంలో ఆటోలో హిందూపురానికి వెళ్తున్నారు. శ్రీకంఠపురం కట్టపైకి వచ్చేసరికి రోడ్డుపక్కన డివైడర్‌ను ఢీకొని ఆటో బోల్తాపడింది. ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో డీఎస్పీ మహేష్‌ హిందూపురం వైపు వస్తుండగా ప్రమాదస్థలిలో ఆగి వెంటనే గాయపడిన వారిని హైవే అంబులెన్సలో హిందూపురం ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా లేపాక్షి మండలం చోళసముద్రం సమీపంలో చిలమత్తూరుకు చెందిన వ్యక్తి ద్విచక్రవాహనంలో వేగంగా వచ్చి అదుపుతప్పి రోడ్డుపక్కనున్న కాలువలో పడ్డాడు. తీవ్ర గాయాలవడంతో స్థానికులు హిందూపురం ఆస్పత్రికి తరలించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Feb 17 , 2026 | 12:43 AM