గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:21 AM
ప్రయాణికుల రద్దీ నియంత్రణకు యశ్వంతపూర్-కలబురగి-యశ్వంతపూర్ మధ్య సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు.
గుంతకల్లు(అనంతపురం): ప్రయాణికుల రద్దీ నియంత్రణకు యశ్వంతపూర్-కలబురగి-యశ్వంతపూర్ మధ్య సింగిల్ ట్రిప్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు. యశ్వంతపూర్-కలబురగి ప్రత్యేక రైలు (నం. 06209) ఈనెల 13వ తేదీ శుక్రవారం రాత్రి 10.40 గంటలకు యశ్వంతపూర్‌లో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.15 గంటలకు కలబురగికి చేరుకుంటుందన్నారు.
దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 06210) 14వ తేదీ శనివారం ఉదయం కలబురగిలో ఉదయం 10.15 గంటలకు బయలుదేరి అదేరోజు రాత్రి 9.45కి యశ్వంతపూర్‌కు చేరుతుందని తెలియజేశారు. ఈ రైలు యల్హంక, హిందూపురం(Hindupuram), ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు(Gunthakal), ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, క్రిష్ణా, యాద్గిర్, షాహాబాద్ స్టేషన్ల మీదుగా వెళ్తుందన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:
632 మంది మీసేవా ఆపరేటర్లపై వేటు
నా గొంతు నొక్కేందుకే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు
Read Latest Telangana News and National News