Share News

PUBLIC FORUM: చేయని పనులకు బిల్లులు

ABN , Publish Date - Jan 06 , 2026 | 11:48 PM

వీబీజీ రామ్‌జీ పథకంలో చేయని పనులకు బిల్లులు చేసుకున్నట్లు సామాజిక తనిఖీ బృందం నిగ్గుతేల్చింది. మంగళవారం మండల కేంద్రంలో ఎస్‌ఆర్‌పీ సీఆర్‌ఎన మూర్తి ఆధ్వర్యంలో ప్రజావేదిక నిర్వహించారు.

PUBLIC FORUM: చేయని పనులకు బిల్లులు
Officials organizing the public forum

చిలమత్తూరు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): వీబీజీ రామ్‌జీ పథకంలో చేయని పనులకు బిల్లులు చేసుకున్నట్లు సామాజిక తనిఖీ బృందం నిగ్గుతేల్చింది. మంగళవారం మండల కేంద్రంలో ఎస్‌ఆర్‌పీ సీఆర్‌ఎన మూర్తి ఆధ్వర్యంలో ప్రజావేదిక నిర్వహించారు. ఏపీడీఓ ప్రొసీడింగ్‌ ఆఫీసర్‌ రమే్‌షబాబు, ఏపీడీ శివానంద్‌నాయక్‌, అంబుడ్స్‌మన శివారెడ్డి హాజరయ్యారు. 12 పంచాయతీల్లో జరిగిన పనులపై తనిఖీలు చేపట్టి తుది నివేదికను ప్రజావేదిక ముందు ఉంచింది. మండలంలో 2024 ఏప్రిల్‌ నుంచి 2025 మార్చి వరకు 629 ఉపాధి పనులు, 76 పంచాయతీ రాజ్‌ పనులు జరిగాయి. ఉపాధి పనుల్లో ఎక్కువగా ఫాంపాండ్‌, చేపల కుంటలు, క్యాటిల్‌ ఫాంలు, చెక్‌డ్యాం పూడికతీత పనులు, హార్టికల్చర్‌కి సంబంధించిన పనులు జరిగాయి. ఫాంపాండ్‌ పనుల్లో తక్కువ కొలతల పనులు చేసి ఎక్కువ కొలతలకు బిల్లులు చేసినట్లు నివేదిక ఇచ్చారు. మొత్తం 629 ఉపాధి పనులకు రూ. 4,62,46,802 ఖర్చు చేశారు. 76 పంచాయతీరాజ్‌ పనులకు రూ.8,23,50,727 ఖర్చు చేశారు. ఉపాధి పనుల్లో రూ.1,09,162, పంచాయతీరాజ్‌ పనుల్లో రూ.10,290 అవనీతి జరిగినట్లు అధికారులు తేల్చారు. మొత్తం రూ.1.19.452 రికవరీ చేశారు. ఏపీఓ అమరావతి, పీఆర్‌ ఇంజనీర్‌ జమాల్‌బాషా పాల్గొన్నారు.

Updated Date - Jan 06 , 2026 | 11:48 PM