Share News

HDP JUDGE : యువతే.. దేశ సంపద

ABN , Publish Date - Jan 05 , 2026 | 11:55 PM

భారతదేశానికి యువతే బలమైన సంపదఅని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. సోమవారం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో జాతీయ యువ దినోత్సవం నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథులుగా హాజరైన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసకాకుండా సన్మార్గంలో పయనించాలన్నారు.

HDP JUDGE : యువతే.. దేశ సంపద
speaking judge Kampalle Shailaja

హిందూపురం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): భారతదేశానికి యువతే బలమైన సంపదఅని అదనపు జిల్లా న్యాయాధికారి కంపల్లె శైలజ అన్నారు. సోమవారం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాలలో జాతీయ యువ దినోత్సవం నిర్వహించారు. ఆమె ముఖ్య అతిథులుగా హాజరైన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసకాకుండా సన్మార్గంలో పయనించాలన్నారు. ప్రపంచంలోనే ఎక్కువ యువత ఉన్న దేశం మనదేనని, భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సెల్‌ఫోన అవసరమైన దానికే వినియోగించాలన్నారు. శారీరక శ్ర మ, యోగా, ధ్యానం యువతకు అవసరమన్నారు. మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ జీవన, ఇనచార్జి ప్రిన్సిపాల్‌ క్రిష్ణమూర్తి నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2026 | 11:55 PM