TDP: హామీ నెరవేర్చిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 02 , 2026 | 11:39 PM
మడకశిరకు ఆర్డీఓ కార్యాలయం రావడం వరమని సీఎం చంద్రబాబు ఇచ్చినమాట నిలుపుకొన్నారని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సచివాలయ ఆవరణలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనక్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
మడకశిర టౌన, జనవరి 2(ఆంధ్రజ్యోతి): మడకశిరకు ఆర్డీఓ కార్యాలయం రావడం వరమని సీఎం చంద్రబాబు ఇచ్చినమాట నిలుపుకొన్నారని నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సచివాలయ ఆవరణలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనక్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాడు సీఎం ఇచ్చిన హామీ నేడు నెరవేరిందన్నారు. ఎమ్మెల్యే ఎంఎ స్‌రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆర్డీఓ కార్యాలయ రావటానికి ఎంతో కృషి చేశారన్నారు. వారి కృషి వల్లే ఆర్డీఓ కార్యాలయం ప్రా రంభమై కార్యాచరణ ప్రారంభించిందన్నారు. జనసేన సీనియర్ నాయకు లు వెంకటే్‌షగుప్తా, కౌన్సిలర్ మేఘన రమేష్ ఆధ్వర్యంలో పట్టణంలోని 12, 13, 14 వార్డుల్లో సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చే శారు. పట్టణ అధ్యక్షుడు నాగరాజు, నాగేంద్ర, రవి, డాక్టర్ కృష్ణమూర్తి, కౌ న్సిలర్లు సుభద్ర, మారుతీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.
గుడిబండ: సీఎం చంద్రబాబుతోనే మడకశిర అన్నివిధాలా అభివృద్ధి చెందుతోందని సింగిల్‌విండో అధ్యక్షుడు మద్దనకుంటప్ప పేర్కొన్నారు. శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం ప్రారంభంపై సీం, డిప్యూటీ సీఎం మంత్రి లోకేశ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ కేశవరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజ్‌నాయక్, శివకుమార్, మంజునాథ్ పాల్గొన్నారు.
రొళ్ల: మండలంలో గ్రామ సచివాలయ, సింగిల్‌విండో కార్యాలయాల ఆవరణలో శుక్రవారం సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. మార్కెట్‌యార్డ్ చైర్మన గురుమూర్తి, స్టేట్ డైరెక్టర్ రామక్రిష్ణ, సింగిల్‌విండో అధ్యక్షులు ఈరన్న, ఉగ్రేగౌడ్ పాల్గొన్నారు.
మడకశిర రూరల్ (ఆంధ్రజ్యోతి): మడకశిరలో ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటుతో ప్రజల చిరకాల వాంఛ నెవవేరింది. టీడీపీ నాయకులు, రైతులు, ప్రజలు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్ చిత్రపటాలకు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. మండల కన్వీనర్ నాగరాజు, క్లస్టర్ కన్వీనర్ మురళీబాబు, నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండమల తిప్పేస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.
అగళి: మండలంలో టీడీపీ నాయకులు, జడ్పీటీసీ ఉమేష్ ఆధ్వర్యంలో సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలను పాలాభిషేకం చేశారు. క్లస్టర్ ఇనచార్జి శివకుమార్, తిప్పేస్వామి, కుమారస్వామి, రవికుమార్, శివన్న, నరసింహప్ప, కర్రియన్న పాల్గొన్నారు.