Home » Penukonda
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పట్టణంలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి.
తమకు ప్రభుత్వం ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని, ప్రతినెలా 5వ తేదీ కల్లా తప్పనిసరిగా చెల్లించాలని సివిల్ సప్లయ్ గోడౌనలో పనిచేసే హమాలీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెనుకొండ పట్టణంలోని సివిల్ సప్లయ్ గోడౌన వద్ద గురువారం వారు హమాలీ సంఘం జిల్లా కార్యదర్శి నాగరాజుతో కలిసి ఆందోళన చేపట్టారు.
మండల కేంద్రంలో సచివాలయం వద్ద రాగుల కొనుగోలు కేంద్రాన్ని టీడీపీ నాయకులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధర క్వింటాల్ రూ.4886తో నిర్ణయించిందన్నారు.
పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫస్టియర్ విద్యార్థులు వీడుకోలు పలుకుతూ ఫేర్‌వెల్‌డేను ఘనంగా నిర్వహించారు.
మండలంలోని పాలసముద్రం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్ల కోసం స్పెషల్ డ్రైవ్ పేరిట బడిలో చేరుదాం- బాగుపడదాం అనే కార్యక్రమాన్ని ఎంఈవో గోపాల్ గురువారం ప్రారంభించారు. హెచఎం రామాంజులుయాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాకమిటీ సభ్యులు, పూర్వవిద్యార్థులు హాజరయ్యారు.
రాష్ట్ర రాజధానిగా అమరావతి బిల్లును పార్లమెంట్‌లో ఉభయ సభలు ఆమెదం తెలపడంతో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం వేడుకలు జరుపుకున్నారు.
పెనుకొండకు మరో పెద్ద పరిశ్రమ రాబోతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.
మండలకేంద్రంలోని బీసీ కాలనీలో నివాసముంటున్న బుచ్చప్ప గారి వెంకటక్రిష్ణపై అల్లుడు చిరంజీవి దాడి చేశాడు. కొద్దిరోజులక్రితం చిరంజీవి భార్యతో గొడపడడంతో ఆమె పుట్టింటికి వచ్చింది.
మండలంలోని నిమల్లాపల్లిలో సోమవారం రైతన్న మీకోసం వారోత్సవాలను కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి కరపత్రాలు పంచుతూ పీఎంకిసాన, అన్నదాత సుఖీభవ పథకాల గురించి అవగాహన కల్పించారు.
ఉమ్మడి జిల్లాల్లో జనవరి నుంచి మార్చి వరకు కొండగుట్టలకు నిప్పు పెట్టేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సాహితీగగన్మహల్ ట్రస్ట్ అధ్యక్షుడు ప్రతా్‌పరెడ్డి కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌ను కోరారు. జిల్లాకేంద్రంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎ్‌సలో ఈమేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.