Minister Savitha: పెనుకొండలో.. ఇస్కాన్ బేస్ క్యాంప్
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:26 PM
పెనుకొండలో.. ఇస్కాన్ బేస్ క్యాంప్ ఏర్పాటుకానుంది. మొత్తం 60 ఎకరాల స్థలంలో రూ.425 కోట్లతో దీని నిర్మాణం జరగనుంది. కాగా.. ఈ బేస్ క్యాంపు నిర్మాణం ద్వారా ఈ బేస్ క్యాంప్ ఏర్పాటుతో 1035 మందికి ప్రత్యక్షంగా 3 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని మంత్రి సవిత తెలిపారు
- రూ.425 కోట్లతో 60 ఎకరాల్లో ఏర్పాటు
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రకటన
హిందూపురం(అనంతపురం): పెనుకొండలో ఇస్కాన్ సంస్థ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్ క్యాంప్ ఏర్పాటు కానుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత(Minister Savitha) తెలిపారు. రాజధానిలో గురువారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఇస్కాన్‌కు స్థలం కేటాయించారని ఆమె తెలిపారు. రూ.425.20 కోట్లతో ఇస్కాన్ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. పెనుకొండ(Penukonda)లోని ప్రఖ్యాతిగాంచిన ఘనగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉన్న కొండపై ఇస్కాన్ టెంపుల్ ఆధ్యాత్మిక, సాంస్కృతిక బేస్‌క్యాంప్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి రెండురోజుల క్రితం జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు సమావేశం పచ్చజెండా ఊపిందని తెలిపారు. మొత్తం 60 ఎకరాల విస్తీర్ణంలో ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటు చేస్తారని మంత్రి వివరించారు. ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతి బేస్‌క్యాంప్ ఏర్పాటుతో పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా పెనుకొండ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. దేశ విదేశాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తారని తెలిపారు.

ఈ బేస్ క్యాంప్ ఏర్పాటుతో 1035 మందికి ప్రత్యక్షంగా 3 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని తెలిపారు. త్వరలోనే బేస్‌క్యాంప్ ఏర్పాటు పనులు ప్రారంభమౌతాయని తెలిపారు. పెనుకొండకు ఖ్యాతిని తెచ్చే బేస్‌క్యాంప్ కేటాయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఇక షోరూం వద్దే వాహన రిజిస్ట్రేషన్
శాప్‌కు 60.76 కోట్లు.. కేంద్ర క్రీడా శాఖ కేటాయింపు
Read Latest Telangana News and National News