Home » Savitha
ఉపాధ్యాయులపై కొందరు దుష్ప్రచారాలు చేస్తూ, వారి వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ అవమానిస్తున్నారని, ఇది ఎంతమాత్రం క్షమార్హం కాదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు.
విజయవాడలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదలి పెట్టే ప్రసక్తి లేదని బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత తెలిపారు.
శ్రీ సత్యసాయి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి సవిత అన్నారు. కార్ల పరిశ్రమ దగ్గర నుంచి గగన తలంలో ఎగిరే విమానాల పరిశ్రమలు సత్యసాయి జిల్లాకి రావడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని చెప్పుకొచ్చారు.
చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి ‘నేతన్నల పడిగాపులు’ పేరుతో ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకువచ్చింది. ఆంధ్రజ్యోతి కథనాలపై ఏపీ మంత్రి సవిత స్పందించారు.
బీసీల ఆత్మగౌరవ జీవనమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత పేర్కొన్నారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్‌లో మంత్రి సవిత నేతృత్వంలో బీసీ రక్షణ చట్టంపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె సవిత మాట్లాడుతూ.. ‘ఎన్నికల ముందు మంత్రి నారా లోకేశ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ బీసీ రక్షణ చట్టం అమలు చేస్తున్నారు.
వెనుకబడిన తరగతుల ఆత్మగౌరవ జీవనమే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్‌లో బీసీ రక్షణ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో నేతన్నలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేతన్న భరోసా పెన్షన్ పథకం దరఖాస్తు ప్రక్రియలో కీలక నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది.
బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఏపీ మంత్రి సవిత వ్యాఖ్యానించారు. ఆయా హాస్టళ్లు, గురుకులాలు, వాటి పరిసరాలు పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు.
మగ్గం నేసే ప్రతి నేతన్నకూ నేతన్నల సేవలో పథకం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. మొదటి విడతలో 71,536 మంది నేతన్నలకు రూ.25 వేల ఆర్థిక సాయం అందించామని తెలిపారు.
గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం చొప్పున బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రులు కొనియాడారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా మంగళవారం శాసనసభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా వారు ప్రసంగించారు.