Share News

అన్నీ అబద్ధపు ప్రచారాలే.. వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్

ABN , Publish Date - Jan 29 , 2026 | 01:52 PM

వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ అన్నీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని, కూటమి సర్కార్‌పై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 అన్నీ అబద్ధపు ప్రచారాలే.. వైసీపీపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
Minister Kollu Ravindra

విజయవాడ, జనవరి 29: టీడీపీ ప్రభుత్వంలోనే మత్స్యకారులకు న్యాయం జరిగిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) అన్నారు. ఈ సందర్బంగా మత్స్యకారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేసి ప్రజలను మోసం చేస్తోందని, కూటమి ప్రభుత్వంపై అన్యాయంగా నిందలు మోపుతున్నారని విమర్శించారు. హవాలా ద్వారా నగదు అందజేసినట్లు సమాచారముందని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వార్తలు పెడతామని బెదిరిస్తున్నారని... ఈ మొత్తాన్ని ప్రజలు చూస్తున్నారని అన్నారు. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.


మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి (Former CM YS Jagan Mohan Reddy) ఇప్పుడు మనుగడకు అవకాశం లేదని, అందుకే రోజూ సమావేశాలు పెట్టి బురదజల్లాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌తో పాటు వైసీపీ గత ప్రభుత్వంలో చేసిన స్కామ్‌లు బయటపడుతున్నాయని, వాటిని డైవర్ట్ చేయడానికే కొంతమంది నాయకులు ఇలాంటి మాటలు వాడుతున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరు నిజంగా పని చేస్తున్నారో ప్రజలు ఆలోచించాలని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.


వారి కృషి అమోఘం: మంత్రి సవిత

savitha-ap-minister.jpg

మత్స్యకారులు ధైర్యానికి, తెలివితేటలకు మారుపేరని అన్నారు మంత్రి సవిత. సముద్రంతో పోరాడుతూ సమాజానికి ఆహారం అందిస్తున్న వారి కృషి అమోఘమని కొనియాడారు. మత్స్యకారుల కుటుంబాలు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నాయని తెలిపారు. ఎన్టీఆర్ కాలం నుంచి బీసీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టీడీపీ అని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు గతంలో ప్రవేశపెట్టిన ఆదరణ-1, ఆదరణ-2 పథకాలు బీసీల ఆర్థిక ఎదుగుదలకు తోడ్పడ్డాయని చెప్పారు. ఇప్పుడు ఆదరణ-3 పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం వల్ల బీసీ కులాలు ఎంతో నష్టపోయాయని అన్నారు. మత్స్యకారులకు ఇచ్చే భృతి రూ.10,000 ఉండగా.. దాన్ని సీఎం చంద్రబాబు 20,000కు పెంచారన్నారు. 2014-19 మధ్య 10 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. మత్స్యకారులంతా టీడీపీ కుటుంబ సభ్యులేనని, రాబోయే ఎన్నికల్లో అందరూ మద్దతు ఇవ్వాలని మంత్రి సవిత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

ఏపీ లిక్కర్ కేసు.. ముగ్గురికి బెయిల్.. మరో ఇద్దరికి షాక్

ఏసీబీ మెరుపు సోదాలు.. వాటిపై అధికారుల ఫోకస్..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 29 , 2026 | 02:40 PM