Share News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు!

ABN , Publish Date - Jan 29 , 2026 | 12:06 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేయనుంది సిట్. ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌కు వెళ్లి మరీ సిట్ అధికారులు నోటీసులు అందజేయనున్నట్లు తెలుస్తోంది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు నోటీసులు!
KCR

హైదరాబాద్, జనవరి 29: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు(Former CM KCR) సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. ప్రధానంగా ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులను సిట్ విచారించిన విషయం తెలిసిందే. తాజాగా.. కేసీఆర్‌నూ విచారించాలని సిట్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే రేపు(శుక్రవారం) ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌‌లో కేసీఆర్‌కు నోటీసులు అందజేసి.. అక్కడే విచారణ చేపట్టేందుకు సిట్ అధికారులు సన్నద్ధమైనట్టు సమాచారం.


రెండేళ్లుగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిట్‌ను పూర్తిగా ప్రక్షాళన చేసి.. సీపీ సజ్జనార్ నేతృత్వంలో మార్పులు చేర్పులు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌‌కు పాల్పడిన పోలీస్ అధికారులను విచారించి, వారిని రిమాండ్‌కు తరలించారు. ఆ తరువాత ఫోన్ ట్యాపింగ్‌లో బాధ్యులుగా ఉన్నవారిని విచారించి వారి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గత ప్రభుత్వ పెద్దలుగా ఉన్న కేటీఆర్, హరీశ్ రావు, సంతోష్ రావులను ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు.

ఈ కేసులో భాగంగా.. మాజీ ముఖ్యమంత్రిని సిట్ అధికారులు విచారించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌కు నోటీసులు అందజేసి.. అక్కడే విచారణ చేపట్టే అవకాశముంది. అయితే కేసీఆర్ ఈ విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.


ఇవి కూడా చదవండి

మేడారంలో మరో కీలక ఘట్టం.. పలువురు ప్రముఖులు రాక..

ఉల్లాసంగా.. ఉత్సాహంగా!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 29 , 2026 | 12:36 PM