Annaparru BC Hostel: అన్నపర్రు బీసీ హాస్టల్ ఘటన.. మంత్రి సవిత ఆరా..
ABN , Publish Date - Oct 10 , 2025 | 01:52 PM
విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. హాస్టల్‌లో మిగిలిన విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండమన్నారు.
గుంటూరు జిల్లా అన్నపర్రు బీసీ హాస్టల్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి సవిత ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సవిత ఆదేశాల నేపథ్యంలో బీసీ వెల్ఫేర్ కార్యదర్శి సత్యనారాయణ, డైరెక్టర్ మల్లికార్జున, కలెక్టర్ తమీమ్ అన్సారియా పెదనందిపాడు పీహెచ్సీకి వెళ్లారు. విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు డైరెక్టర్ మల్లికార్జున మంత్రి సవితకు తెలిపారు.
నేటి సాయంత్రానికి విద్యార్థులను డిశ్చార్జి చేస్తారని వెల్లడించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు తనకు నివేదిక ఇవ్వాలని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. హాస్టల్‌లో మిగిలిన విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండమన్నారు. కాచి చల్లార్చిన తాగునీరు, తాజా ఆహారం మాత్రమే అందించాలని స్పష్టం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. తాగునీరు, ఆహారం శాంపిళ్లను వైద్య పరీక్షల కోసం పంపి నివేదిక ఇవ్వాలని మంత్రి సవిత అన్నారు.
ఇవి కూడా చదవండి
పెళ్లై నాలుగు నెలలు.. భార్యను చంపి శవంతో రెండు రోజుల పాటు..
ప్రేమ పెళ్లి.. పొట్టిగా ఉన్నాడని బావను దారుణంగా చంపాడు!