Share News

Husband Lives With Wife Body For 2 Days: పెళ్లై నాలుగు నెలలు.. భార్యను చంపి శవంతో రెండు రోజుల పాటు..

ABN , Publish Date - Oct 10 , 2025 | 12:41 PM

ఆ ఇంట్లో ఆకాశ్‌తో పాటు అతడి తల్లి మాత్రమే ఉంటోంది. తల్లికి అనుమానం రాకుండా ఉండేందుకు సాక్షి పుట్టింటికి వెళ్లిందని అబద్ధం చెప్పాడు. రెండు రోజుల పాటు భార్య శవాన్ని ఉంచిన బెడ్‌పైనే పడుకున్నాడు.

Husband Lives With Wife Body For 2 Days: పెళ్లై నాలుగు నెలలు.. భార్యను చంపి శవంతో రెండు రోజుల పాటు..
Husband Lives With Wife Body For 2 Days

అదనపు కట్నం కోసం ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కట్టుకున్న భార్యను గొంతు పిసికి చంపేశాడు. శవాన్ని బెడ్ కింద దాచి రెండు రాత్రిళ్లు దానిపైనే పడుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బెలగామ్ జిల్లా ముదలకి మండలం, కమలదిన్నికి చెందిన ఆకాశ్‌కు అదే ప్రాంతానికి చెందిన సాక్షితో మే 24వ తేదీన ఘనంగా పెళ్లి జరిగింది. ఆకాశ్ హుబ్లిలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ప్రతీ నెలా లక్ష రూపాయలు పైనే సంపాదిస్తున్నాడు. నెలకు లక్ష రూపాయలు జీతం వస్తున్నా.. సాక్షి తల్లిదండ్రులు కట్నంగా పెద్ద మొత్తంలో డబ్బు, బంగారం ఇచ్చినా అతడి ఆశ మాత్రం చావలేదు. అదనపు కట్నం కోసం సాక్షిని ఇబ్బందిపెట్టసాగాడు.


పుట్టింటి నుంచి 50 తులాల బంగారం, ఐదు లక్షల నగదు తీసుకురమ్మని ప్రతీ రోజూ కొట్టేవాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం మధ్యాహ్నం సాక్షి గొంతు పిసికి చంపేశాడు. శవాన్ని బెడ్‌రూములోని బెడ్ కింద దాచేశాడు. ఆ ఇంట్లో అతడితో పాటు తల్లి మాత్రమే ఉంటోంది. తల్లికి అనుమానం రాకుండా ఉండేందుకు సాక్షి పుట్టింటికి వెళ్లిందని అబద్ధం చెప్పాడు. రెండు రోజుల పాటు భార్య శవాన్ని ఉంచిన బెడ్‌పైనే పడుకున్నాడు. ఏమీ జరగన్నట్లు ఆఫీస్‌కు వెళ్లి వస్తుండేవాడు. అయితే, ఆకాశ్ బెడ్‌రూము నుంచి దుర్వాసన వస్తుండటంతో అతడి తల్లికి అనుమానం వచ్చింది.


అతడు ఇంట్లోలేని సమయంలో బెడ్‌రూములోకి వెళ్లింది. బెడ్ ఎత్తి చూసి షాక్ అయింది. కుళ్లిపోతున్న స్థితిలో కోడలు సాక్షి శవం కనిపించింది. ఆ దృశ్యం చూడగానే గట్టిగా కేకలు పెడుతూ ఇంటి బయటకు పరుగులు పెట్టింది. ఇంటి పక్క ఉండే వారికి విషయం చెప్పింది. వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సాక్షి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మర్డర్ విషయం అందరికీ తెలిసిపోవటంతో ఆకాశ్ అప్‌స్కాండ్ అయ్యాడు. పోలీసులు అతడికోసం గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

చంద్రబాబు పేరుతో నకిలీ వీడియో కాల్.. కొత్త మోసానికి తెర

చంద్రబాబు విజనరీ లీడర్.. ప్రతీ అడుగు ప్రగతి దిశవైపే: మంత్రి మండిపల్లి

Updated Date - Oct 10 , 2025 | 12:48 PM