Share News

Chandrababu Naidu CM 15 Years: చంద్రబాబు విజనరీ లీడర్.. ప్రతీ అడుగు ప్రగతి దిశవైపే: మంత్రి మండిపల్లి

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:56 AM

15 ఏళ్ల పాలనలో అభివృద్ధి, పరిపాలన, ప్రజా సేవకు కొత్త ప్రమాణాలు సృష్టించారని.... ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ రూపకర్త, దూరదృష్టి కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు.

Chandrababu Naidu CM 15 Years: చంద్రబాబు విజనరీ లీడర్.. ప్రతీ అడుగు ప్రగతి దిశవైపే: మంత్రి మండిపల్లి
Chandrababu Naidu CM 15 Years

అమరావతి, అక్టోబర్ 10: రాష్ట్ర అభివృద్ధికి ప్రతీకగా నిలిచిన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడుకు (CM Chandrababu Naidu) 15 ఏళ్ల సీఎం పదవీ ప్రస్థానం పూర్తైన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Mandipalli Ramprasad Reddy). శుక్రవారం నాడు మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. 15 ఏళ్ల పాలనలో అభివృద్ధి, పరిపాలన, ప్రజా సేవకు కొత్త ప్రమాణాలు సృష్టించారన్నారు. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ రూపకర్త, దూరదృష్టి కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. సాంకేతికత, పారదర్శకత, పరిపాలనలో ప్రగతిశీలతో కూడిన నాయకత్వం చంద్రబాబుది అని చెప్పుకొచ్చారు.


రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగ సృష్టి, పెట్టుబడులు ప్రతి రంగంలో సుస్థిర మార్గదర్శకుడిగా ఆయన నిలిచారని వెల్లడించారు. రైతు నుంచి ఐటీ ప్రొఫెషనల్ వరకు అందరికీ చేరువైన నాయకుడు చంద్రబాబు అని.. గ్రామీణ అభివృద్ధి, నగరీకరణ, మహిళా సాధికారతలో నూతన దిశ చూపిన నాయకుడంటూ కొనియాడారు. తెలుగువారి గౌరవాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన విజనరీ లీడర్ చంద్రబాబు అని పేర్కొన్నారు. కష్టాలు, ప్రతికూలతల మధ్య ప్రజల కోసమే అహర్నిశలు శ్రమించిన అభివృద్ధి శిల్పి అని చెప్పుకొచ్చారు. ప్రతి అడుగు ప్రగతి దిశ వైపు వేసే ఆయన వెంట ప్రయాణించడం, ఆయన మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించడం అదృష్టమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏం తేల్చిందంటే...

గుట్టువిప్పిన కట్టా రాజు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 10 , 2025 | 11:58 AM