Minister Satya kumar: మెడికల్ కాలేజీల్లో జగన్ భారీ అవినీతి
ABN , Publish Date - Oct 10 , 2025 | 06:52 AM
కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంలో అప్పటి సీఎం జగన్ భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి సత్యకుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
ఒక్కో కళాశాలకు కాంట్రాక్టర్ల నుంచి 100 కోట్లు ముడుపులు: సత్యకుమార్
అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణంలో అప్పటి సీఎం జగన్ భారీగా అవినీతికి పాల్పడ్డారని మంత్రి సత్యకుమార్ సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కో కళాశాలకు రూ.వంద కోట్ల చొప్పున ముడుపులు తీసుకున్నారని ధ్వజమెత్తారు. ‘రూ.400 కోట్లు ఖర్చయ్యే దానికి రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులు ఇవ్వడం వెనుక ముడుపుల బాగోతం నడిచింది. ఇచ్చిన కమీషన్లు తిరిగి ఇవ్వాలని కాంట్రాక్టర్లు ఒత్తిడి చేస్తుండడంతో దిక్కుతోచక.. పీపీపీ విధానంలో కళాశాలల నిర్మాణానికి ముందుకొచ్చే వారిని బెదిరిస్తూ, ఉత్తుత్తి పర్యటనలకు సిద్ధమయ్యారు’ అని మంత్రి మండిపడ్డారు.