Share News

Rushikonda Palace Utilization: రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏం తేల్చిందంటే...

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:36 AM

గతంలో రూ.7 కోట్లు ఆదాయం వచ్చే చోట ఇప్పుడు ప్రభుత్వం ఎదురు చెల్లించాల్సి వస్తున్న పరిస్థితులను ఎలా అధిగమించాలనే విషయంపై సబ్ కమిటీ చర్చించింది.

Rushikonda Palace Utilization: రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏం తేల్చిందంటే...
Rushikonda Palace Utilization

అమరావతి, అక్టోబర్ 10: ఏపీ కేబినెట్ మరికాసేపట్లో సమావేశం కానుంది. కేబినెట్ సమావేశానికి ముందు రుషికొండ ప్యాలెస్ (Rushikonda Palace) వినియోగంపై మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు (శుక్రవారం) సచివాలయంలో భేటీ అయ్యింది. రుషికొండ ప్యాలెస్‌‌ను ఎలా వినియోగించాలి అన్న దానిపై చర్చించారు. రుషికొండను ప్రజాప్రయోజనకర వినియోగానికి సబ్‌ కమిటీ సిఫార్సులు చేసింది. ఎలాంటి ఉపయోగం లేకుండా ఉన్న రుషికొండ ప్యాలెస్ వల్ల నెలకు 25 లక్షలు విద్యుత్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు భరించాల్సి వస్తోందని మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. గతంలో రూ.7 కోట్లు ఆదాయం వచ్చే చోట ఇప్పుడు ప్రభుత్వం ఎదురు చెల్లించాల్సి వస్తున్న పరిస్థితులను ఎలా అధిగమించాలనే విషయంపై సబ్ కమిటీ చర్చించింది. ప్రజాభిప్రాయాలు కోరుతూ ప్రకటన ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.


అతిథ్య రంగానికి హోటల్ నిర్వహణ, చికిత్సాలయం ఏర్పాటు చేయాలంటూ వచ్చిన ప్రతిపాదనలు, సలహాలు మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. ప్రజల నుంచి మరింత విస్తృతంగా సలహాలు సూచనలు తీసుకోవాలని ఉపసంఘం నిర్ణయించింది. రుషికొండ భవనాన్ని ప్రజా వినియోగంలోకి తీసుకురావడం, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేసే అంశంపై కసరత్తు చేపట్టింది. త్వరలో రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ప్రభుత్వానికి కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సమర్పించనుంది. గత పాలకులు దాదాపు రూ.500 కోట్లతో రుషికొండపై విలాసవంతమైన ప్యాలెస్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్, డీఎస్‌బీవీ స్వామి, కందుల దుర్గేష్‌ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

రాష్ట్ర యువతకువిదేశీ కొలువులు

గుట్టువిప్పిన కట్టా రాజు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 10 , 2025 | 11:38 AM