Share News

Minister Lokesh: రాష్ట్ర యువతకువిదేశీ కొలువులు

ABN , Publish Date - Oct 10 , 2025 | 07:07 AM

వచ్చే ఐదేళ్లలో ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఓంక్యాప్‌) ద్వారా లక్ష బ్లూకాలర్‌ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్‌ శాఖల మంత్రి లోకేశ్‌ తెలిపారు.

Minister Lokesh: రాష్ట్ర యువతకువిదేశీ కొలువులు

  • ఓంక్యాప్‌ ద్వారా ఐదేళ్లలో లక్ష బ్లూకాలర్‌ ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యం

  • నైపుణ్యాభివృద్ధిపై సమీక్షలో మంత్రి లోకేశ్‌

  • రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు నామ్‌టక్‌ సంస్థ ముందుకొచ్చినట్లు వెల్లడి

అమరావతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): వచ్చే ఐదేళ్లలో ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఓంక్యాప్‌) ద్వారా లక్ష బ్లూకాలర్‌ ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని విద్య, ఐటీ, ఎలకా్ట్రనిక్‌ శాఖల మంత్రి లోకేశ్‌ తెలిపారు. ఇందుకు నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌ అధికారులు తగిన రూట్‌మ్యా్‌పను రూపొందించి, ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. గురువారం స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ అధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. నర్సింగ్‌, వెల్డర్లు, ట్రక్కర్లు, బిల్డింగ్‌ వర్కర్లకు యూర్‌పతోపాటు జర్మనీ, ఇటలీల్లో మంచి డిమాండ్‌ ఉందని తెలిపారు. నర్సింగ్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యనభ్యసించిన యువతీ యువకులకు ఆయా భాషల్లో శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాలు లభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఓంక్యాప్‌ ద్వారా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 2,774 మంది నర్సింగ్‌ అభ్యర్థులు విదేశీ భాషల్లో శిక్షణ పొందుతున్నారని అధికారులు తెలిపారు. జర్మనీ, ఇతర విదేశీ భాషల్లో శిక్షణ కోసం డీఈఎ్‌ఫఏ, డీఈఎల్‌సీ (యూరోపియన్‌ లాంగ్వేజ్‌ సర్టిఫికేషన్‌), జర్మన్‌ లాంగ్వేజెస్‌ ఎసె్‌సమెంట్‌ సెంటర్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. నైపుణ్యం పోర్టల్‌పై లోకేశ్‌ సమీక్షించారు. ఇందులో 23 విభాగాల డాటాబేస్‌ను ఏకీకతృతం చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని 4,639 భారీ, మధ్యతరహా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేయాలన్నారు. వచ్చే నెలలో పోర్టల్‌ను ప్రారంభించే సమయానికి ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని యువతకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆర్సెలర్‌ మిట్టల్‌ అండ్‌ నిప్పాన్‌ స్టీల్స్‌ అనుబంధ సంస్థ నామ్‌టక్‌ (న్యూ ఏజ్‌ మేకర్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చినట్లు తెలిపారు.


పాలిటెక్నిక్‌ కళాశాలలను తీర్చిదిద్దాలి

మిషన్‌ మోడల్‌లో 83 ప్రభుత్వ ఐటీఐల అభివృద్ధి కి చర్యలు చేపట్టాలని లోకేశ్‌ చెప్పారు. వాటిలో మౌలిక వసతులు, ఆధునికీకరణ పనుల కోసం రూ.322 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. పీఎం వికసిత్‌ భారత్‌ రోజ్‌గార్‌ యోజన, పీఎం ఇంటర్న్‌షి్‌పలలో ఏపీని అగ్రస్థానంలో నిలపాలని మంత్రి కోరారు. 87 పాలిటెక్నిక్‌లలో 646 టీచింగ్‌, 2,183 నాన్‌ టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్‌ కళాశాలలను మెరుగ్గా తీర్చిదిద్దేందుకు దేశంలో విజయవంతమైన మోడల్‌ను అధ్యయనం చేయాలని లోకేశ్‌ ఆదేశించారు. హబ్‌ అండ్‌ స్పోక్‌ మోడల్‌లో విశాఖ, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో 3 హబ్‌లు, వాటికి అనుబంధంగా 13 స్పోక్స్‌లలో ఐటీఐల అభివృదికి ప్రణాళికలను త్వరగా సిద్ధం చేయాలన్నారు.


  • స్టార్ట్‌పల వృద్ధిలో దేశంలోనే టాప్‌గా ఉండాలి

  • ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి

  • నేడు క్యాబినెట్‌ ముందుకు ‘క్వాంటమ్‌’ పాలసీ

అమరావతి, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఐదేళ్లలో ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ రంగాల్లో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యమని మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు. గురువారం ఉండవల్లిలో ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ శాఖపై సమీక్ష నిర్వహించారు. స్టార్టప్‌ల వృద్ధిలో దేశంలో అగ్రస్థానంలో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాట్సప్‌ గవర్నెన్స్‌ను సమర్థంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పాలసీని శుక్రవారం మంత్రివర్గం ఆమోదించనుందని చెప్పారు. పెట్టుబడులు పెట్టిన, కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ పరిశ్రమలకు త్వరలోనే రాయితీలు చెల్లిస్తామన్నారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌, ఇన్నోవేషన్‌ సొసైటీ, స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌పైనా చర్చించారు. పెట్టుబడులకు ఆసక్తి చూపిన సంస్థలతో ఒప్పందాలు కార్యరూపం దాల్చి కార్యకలాపాలు చేపట్టేంత వరకూ సంప్రదింపులు జరుపుతూనే ఉండాలని సూచించారు. గూగుల్‌, టీసీఎస్‌, ఏఎన్‌ఎ్‌సఆర్‌ వంటి కంపెనీలు త్వరితగతిన కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఐదేళ్లలో ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌ రంగాల్లో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యమని, ప్రపంచంలో టాప్‌-100 కంపెనీల యాజమాన్యాలతో నిత్యం సంప్రదింపులు జరపాలని సూచించారు.

Updated Date - Oct 10 , 2025 | 07:08 AM