Share News

Man killed Brother in law: ప్రేమ పెళ్లి.. పొట్టిగా ఉన్నాడని బావను దారుణంగా చంపాడు!

ABN , Publish Date - Oct 10 , 2025 | 11:49 AM

ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం పొట్టిగా ఉన్నాడన్న కారణంగా స్వంత బావమరిదిని బావ దారుణంగా చంపేశాడు. తన చెల్లిని ట్రాప్ చేసి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని.. కోపంతో రగిలిపోయిన ఓ వ్యక్తి , తన బావను ఎలాగైనా చంపాలని కోపంతో రగిలిపోయాడు. అదును చూసి..

Man killed Brother in law: ప్రేమ పెళ్లి.. పొట్టిగా ఉన్నాడని బావను దారుణంగా చంపాడు!

ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం పొట్టిగా ఉన్నాడన్న కారణంగా స్వంత బావమరిదిని బావ దారుణంగా చంపేశాడు. తన చెల్లిని ట్రాప్ చేసి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని.. కోపంతో రగిలిపోయిన ఓ వ్యక్తి , తన బావను ఎలాగైనా చంపాలని కోపంతో రగిలిపోయాడు. అదును చూసి రోడ్డుపై వెళ్తుండగా దారుణంగా చంపాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


పెళ్లి సంబంధం కోసం అబ్బాయి కుర్రా గణేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడ్డానికి అమ్మాయి కీర్తి అంజనీ దేవి ఫ్యామిలీ వెళ్ళింది. గణేష్ పొట్టిగా ఉన్నాడని పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు నిరాకరించారు. కానీ తొలి చూపులోనే గణేష్, కీర్తి ఒకరినొకరు ఇష్టపడ్డారు. ఫోన్‌లో మాట్లాడుకొని మరింత దగ్గరవ్వగా.. పారిపోయి 10 రోజుల క్రితం గుడిలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. దీంతో కోపోద్రిక్తుడైన కీర్తి సోదరుడు దుర్గారావు మాయమాటలు చెప్పి చెల్లిని పెళ్లి చేసుకున్నావని, అంతు చూస్తానని గణేష్‌కి వార్నింగ్ ఇచ్చాడు.


కీర్తి సోదరుడు బెదిరించడంతో.. తనకు యువతి కుటుంబసభ్యులతో ప్రాణహాని ఉందంటూ గణేష్.. నల్లపాడు పోలీసులను ఆశ్రయించాడు. ఇటీవల బ్యాంక్‌కి వెళ్లి వస్తుండగా అదునుచూసి బావ గణేష్‌ను బావమరిది దుర్గారావు నడిరోడ్డుపై కత్తితో పొడిచి (Man killed Brother in law) దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దుర్గారావును విచారించారు. తన బావ పొట్టిగా ఉన్నాడని, మాయమాటలు చెప్పి చెల్లిని పెళ్లి చేసుకున్నందుకే చంపానని దుర్గారావు సమాధానమిచ్చాడు. కొత్త కాపురంలో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం కాన్వాయ్‌ అంబులెన్స్‌కు ఇన్సూరెన్స్‌ మరిచారు

భార్య డబ్బులు ఇవ్వలేదని చెరువులో దూకిన భర్త

Read Latest Telangana News and National News

Updated Date - Oct 10 , 2025 | 12:22 PM