AP Government: నేతన్నలకు మరో గుడ్ న్యూస్.. రూ.1.67 కోట్లు విడుదల..
ABN , Publish Date - Jan 19 , 2026 | 08:10 PM
ఏపీలో నేతన్నలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్నలకు సంబంధించి త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేసింది..
అమరావతి, జనవరి19 (ఆంధ్రజ్యోతి): ఏపీలో నేతన్నలకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. నేతన్నలకు సంబంధించి త్రిఫ్ట్ ఫండ్ నిధులను విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఏపీ మంత్రి సవిత మీడియాకు వెల్లడించారు. 2025-26కు సంబంధించి మొదటి విడత నిధులను విడుదల చేశామని పేర్కొన్నారు. 133 చేనేత సహకార సంఘాల బ్యాంకు ఖాతాల్లో రూ.1.67 కోట్లు జమ చేశామని వెల్లడించారు. నిధుల విడుదలతో 5,726 నేతన్నలకు లబ్ధి చేకూరనుందని చెప్పుకొచ్చారు.

సంక్రాంతి ముందు రూ.5 కోట్ల ఆప్కో బకాయిలు చెల్లించామని మంత్రి సవిత ప్రస్తావించారు. డిసెంబరులో రూ.2.42 కోట్ల బకాయిలను ఆప్కో చెల్లించిందని గుర్తుచేశారు. రెండు నెలల వ్యవధిలో రూ.9 కోట్లకు పైగా నేతన్నలకు అందజేశామని వివరించారు. చేనేత రంగ అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా త్రిఫ్ట్ ఫండ్ నిధుల విడుదలపై కూటమి ప్రభుత్వానికి, మంత్రి సవితకు చేనేత సహకార సంఘ ప్రతినిధులు, నేతన్నలు ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ
Tirupati Incident: తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest AP News And Telugu News