Share News

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ

ABN , Publish Date - Jan 19 , 2026 | 05:19 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లో సోమవారం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చంద్రబాబు పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా ఉంది.

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ
CM Chandrababu Naidu

ఇంటర్నెట్ డెస్క్, జనవరి19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్విట్జర్లాండ్‌లో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్‌ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏపీలో పెట్టుబడులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీకి మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. స్విట్జర్లాండ్ దేశంలోని ప్రముఖ కంపెనీల వివరాలు, పెట్టుబడుల సాధనకు ఉన్న అవకాశాలపై చర్చించామని తెలిపారు.


ఏపీలో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలని భారత రాయబారి మృదుల్ కుమార్‌ను కోరినట్లు వెల్లడించారు. ఫార్మా, వైద్య పరికరాలు, మిషనరీ తయారీ, హార్డ్‌వేర్–ఎలక్ట్రానిక్స్, రైల్ కంపోనెంట్స్, టెక్నిలకల్ టెక్స్ టైల్స్, ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలు వంటి రంగాల్లో సహకారం కోరామని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఏపీ తెచ్చిన పాలసీలను... పారిశ్రామిక ప్రగతి కోసం తీసుకున్న నిర్ణయాలను భారత్ అంబాసిడర్‌కు వివరించారు. 2025లో చేపట్టిన దావోస్ పర్యటన సక్సెస్ అయిందని.. సుమారు రూ. 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సాకారమయ్యాయని మృదుల్ కుమార్ తెలిపారు. ఎన్నార్టీల భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధికి మరింత దోహదం చేసే విధంగా కృషి చేయాలని సీఎం సూచించారు. మధ్య యూరప్‌లోని లిచ్టెన్ స్టైన్ అనే దేశంలో జరుగుతున్న ఏఐ ప్రగతికి సంబంధించిన వివరాలను సీఎంకు వివరించారు మృదుల్ కుమార్.


మానవ వనరుల కొరత...

నేడు ఏ దేశానికి తాము వెళ్లినా భారతీయుల విజయాలు గర్వకారణంగా ఉంటున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేడు ప్రపంచంలో అనేక దేశాలు మానవ వనరుల కొరతతో ఉన్నాయని తెలిపారు. భారతదేశం యువశక్తితో సిద్ధంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రపంచ మానవ వనరుల కొరతకు సమాధానం భారతదేశంలోనే లభిస్తుందని తెలిపారు. లిచ్టెన్ స్టైన్ వంటి దేశంలో ఏఐ పురోగతి ఆసక్తిదాయకంగా ఉందని వివరించారు. ఫిబ్రవరిలో భారతదేశంలో జరిగే ఏఐ సదస్సులో లిచ్టెన్ స్టైన్ దేశ ప్రతినిధులతో సమావేశమవుతానని వెల్లడించారు. ప్రకృతి సేద్యంలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సహకరించాలి: మంత్రి నారా లోకేశ్

nara-Lokesh.jpg

స్విట్జర్లాండ్ దేశంలోని ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు ఏపీకి రావడానికి ఇక్కడి ప్రతినిధులు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ కోరారు. వివిధ కంపెనీలతో ఏపీని కనెక్ట్ చేసేందుకు భారత రాయబారి సహకరించాలని సూచించారు. వివిధ రంగాలకు చెందిన కంపెనీలకు అవసరమైన మ్యాన్ పవర్‌ను సప్లై చేసేందుకు ఏపీ సన్నద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. యువతకు నైపుణ్యంలో శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. వంద కేజీల బరువు మోసే డ్రోన్లు తయారు చేసే కంపెనీలు ఉన్నాయని... వాటిని కనెక్ట్ చేస్తామని తెలిపారు. బీ టు బీ ద్వారా ఈ పెట్టుబడులను సాకారం చేద్దామని మంత్రి నారా లోకేశ్ సూచించారు.


ఇవి కూడా చదవండి...

తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

వేమన నీతి సూత్రాలు సమాజానికి అనుసరణీయం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 19 , 2026 | 05:33 PM