Share News

Minister Savita:రాయలసీమ లిఫ్ట్ పనుల నిలిపివేతపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అసత్యం..

ABN , Publish Date - Jan 04 , 2026 | 01:23 PM

తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదని ఏపీ మంత్రి సవిత పేర్కొన్నారు. చంద్రబాబును ఓ కారణంగా చూపి తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు.

Minister Savita:రాయలసీమ లిఫ్ట్ పనుల నిలిపివేతపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అసత్యం..
AP Minister Savita

విజయవాడ, జనవరి4(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపివేసిందన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యలు సరికాదని ఏపీ మంత్రి సవిత (AP Minister Savita) పేర్కొన్నారు. చంద్రబాబును ఓ కారణంగా చూపి తెలంగాణ రాజకీయాలు నడుపుతూ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును నాటి ప్రభుత్వం చేపట్టిందని ప్రస్తావించారు. ఇవాళ(ఆదివారం) విజయవాడలో సవిత పర్యటించారు. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి సవిత.


జగన్ హయాంలో సీమకు రోజుకు మూడు టీఎంసీల నీరు అంటూ భారీ ప్రకటనలతో అనుమతులు లేకుండా పనులు చేపట్టిందని గుర్తుచేశారు. నాటి సీఎం జగన్ ప్రచారంతో రాయలసీమ లిఫ్ట్‌లో కోర్టులో తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసిందని ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్జీటీతో సహా పలు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులతో విచారించి అనుమతులు లేని కారణంగా పనులు నిలిపివేశారని పేర్కొన్నారు. 2020లోనే ఈ మేరకు ఎన్టీటీ, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు మంత్రి సవిత.


ఇది ముమ్మాటికీ జగన్ చేసిన తప్పిదమేనని విమర్శించారు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులు నిలిపివేసిందని అన్నారు. జగన్ రెడ్డి తప్పు చేసి ఆ బురద తమపై జల్లుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన నీలి మీడియాలో తప్పుడు రాతలు రాయిస్తున్నారని ఆరోపణలు చేశారు. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రారంభించిన విధానం, అనుమతులు, పనుల నిలిపివేతపై ఆధారాలతో వాస్తవాలు త్వరలో బయటపెడతామని తేల్చిచెప్పారు. రాయలసీమకు తాగు, సాగునీరు కల్పించిన ఘనత చంద్రబాబుదేనని మంత్రి సవిత పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చారిత్రక ఘట్టం

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వివరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 04 , 2026 | 01:29 PM