Share News

Minister Savita: ఆదరణ-3 పథకం అమలుపై మంత్రి సవిత కీలక ప్రకటన

ABN , Publish Date - Nov 03 , 2025 | 06:24 PM

ఆదరణ-3 పథకం అమలుపై బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. విజయవాడలో ఇవాళ(సోమవారం నాడు) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో ఆదరణ-3 పథకం అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. అలానే ఈ పథకానికి రూ. వెయ్యి కోట్లు వెచ్చించబోతున్నట్లు మంత్రి చెప్పారు.

Minister Savita: ఆదరణ-3 పథకం అమలుపై మంత్రి సవిత కీలక ప్రకటన
Adarana 3 Scheme

అమరావతి, నవంబర్ 3: ఆదరణ-3 పథకం అమలుపై బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత కీలక ప్రకటన చేశారు. విజయవాడలో ఇవాళ(సోమవారం నాడు) ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో ఆదరణ-3 పథకం అమలు చేయబోతున్నట్లు వెల్లడించారు. అలానే ఈ పథకానికి రూ. వెయ్యి కోట్లు వెచ్చించబోతున్నట్లు మంత్రి సవిత (Minister Savita)చెప్పారు. ఆదరణ-3 పథకం(Adarana 3 Scheme) అమలుపై బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్లతో వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. నకిలీ మద్యం కేసుపై కూడా మంత్రి సవిత స్పందించారు. ఈ కేసుపై వైసీపీ సీబీఐ విచారణ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘బాబాయి గొడ్డలిపోటు’పై సీబీఐ దర్యాప్తును వైసీపీ ఎందుకు కోరట్లేదని ఆమె(Minister Savita) ప్రశ్నించారు.


ఆదరణ-3 పథకం(Adarana 3 Scheme) అమలు చేయాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కులవృత్తిదారులకు అవసరమయ్యే అత్యాధునిక పరికరాలను ఎంపిక చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడనుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆదరణ-2లో రాష్ట్రస్థాయిలో పరికరాలను ఎంపిక చేసి ఆ తర్వాత లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అయితే ఆదరణ-3లో భాగంగా లబ్ధిదారులే తమకు కావాల్సిన పరికరాలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించింది. ఆదరణ-2(Adarana Scheme) సమయంలో 90శాతం రాయితీతో పరికరాలను అందజేస్తారు.. మిగిలిన 10శాతం లబ్ధిదారుడు చెల్లించాల్సి ఉంటుంది. ఆదరణ-3లో కూడా ఇదే విధానం ఉంచనున్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల విచారణకు శ్యామల.. సంధించిన ప్రశ్నలివే

ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వేళాయె.. సైబీరియన్ పక్షుల రాకపై పవన్ ట్వీట్

Updated Date - Nov 03 , 2025 | 06:25 PM