Shyamala Police Inquiry: పోలీసుల విచారణకు శ్యామల.. సంధించిన ప్రశ్నలివే
ABN , Publish Date - Nov 03 , 2025 | 04:42 PM
కర్నూలు డీఎస్పీ ఆఫీసులో రెండు గంటల పాటు శ్యామలను డీఎస్పీ బాబు ప్రసాద్ విచారణ జరిపారు. దాదాపు 65 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.
కర్నూలు, నవంబర్ 3: వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల (YSRCP Anchor Shyamala) పోలీసుల విచారణ ముగిసింది. కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం చేశారంటూ చేసిన వ్యాఖ్యలపై శ్యామలకు పోలీసులు నోటీసులు అందజేశారు. విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. ఈక్రమంలో ఈరోజు (సోమవారం) వైసీపీ నేత విచారణకు వచ్చారు. కర్నూలు డీఎస్పీ ఆఫీసులో రెండు గంటల పాటు శ్యామలను డీఎస్పీ బాబు ప్రసాద్ విచారణ జరిపారు. దాదాపు 65 ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. బస్సు ప్రమాదం ఘటనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై ఆధారాలు చూపాలని డీఎస్పీ కోరినట్లు సమాచారం. విచారణ అనంతరం శ్యామల మీడియాతో మాట్లాడుతూ.. విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపలేదా?.. బైకర్స్ బెల్టు షాపులో మద్యం తాగలేదా ? అంటూ బస్సు ప్రమాదంపై మరోసారి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే.. విచారణలో పోలీసులు అడిగిన ప్రశ్నలకు శ్యామల ఉక్కిరిబిక్కిరి అయినట్లు తెలుస్తోంది. ‘బస్సు ప్రమాదంపై నాకు ఎలాంటి అవగాహన లేదు. నేను బస్సు ప్రమాదం ఘటనా స్థలానికి వెళ్ల లేదు. వి. కావేరి ట్రావెల్స్ బస్సు యాజమాన్యం, బస్సు డ్రైవర్‌లతో, మద్యం తాగిన బైకర్‌లతో మాట్లాడలేదు. పార్టీ ఆదేశాల మేరకు వాళ్ళు చెప్పింది మాత్రమే మాట్లాడానని’ పోలీసులకు శ్యామల చెప్పినట్లు సమాచారం.
కాగా.. బెల్టు షాపుల్లో మద్యం తాగడం వల్లే ప్రమాదం జరిగిందంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కర్నూలుకు చెందిన వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు యాంకర్ శ్యామల, సీవీ రెడ్డి సహా 27 మందిపై కేసు నమోదు చేసి.. విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
చేవెళ్ల బస్సు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి
ఫ్లెమింగో ఫెస్టివల్‌కు వేళాయె.. సైబీరియన్ పక్షుల రాకపై పవన్ ట్వీట్
Read Latest AP News And Telugu News