Women's cricket team: మహిళా జట్టుకు డైమండ్ నెక్లెస్‌లు.. సూరత్ వ్యాపారి భారీ బహుమతులు..
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:04 PM
మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు విజయం సాధించి ప్రపంచకప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి విశ్వ విజేతగా నిలిచిన భారత మహిళల జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత జట్టు విజయం సాధించి ప్రపంచకప్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమ్మాయిల జట్టుకు పలువురు బహుమతులు ప్రకటిస్తున్నారు. సూరత్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజ్యసభ ఎంపీ గోవింద్ ఢోలాకియా (Govind Dholakia) అమ్మాయిల జట్టుకు భారీ బహుమతులు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.
అమ్మాయిల జట్టు ప్రపంచకప్ సాధిస్తే సభ్యులందరికీ వజ్రాల నెక్లెస్‌లు, సోలార్ ప్యానెళ్లు ఇవ్వాలనుకుంటున్నట్టు ఫైనల్ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు గోవింద్ ఢోలాకియా లేఖ రాశారు (diamond reward). భారత్ జట్టు విజేతగా నిలిచిన తర్వాత ఢోలాకియా తన మాటను నిలబెట్టుకున్నారు. త్వరలోనే మహిళా జట్టు సభ్యులకు డైమండ్ నెక్లెస్‌లు ఇస్తానని, వారి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తానని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
సూరత్‌కు చెందిన ఢోలాకియా శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వ్యవస్థాపకుడు (Surat industrialist). ఆయన గతంలో కూడా పలు భారీ బహుమతులు ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో తన సంస్థ ఉద్యోగులకు సర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్ ఇచ్చి వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆయన మహిళా జట్టుకు కూడా బహుమతులు ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా
Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!