CITU: మహాసభలను విజయవంతం చేయండి
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:11 AM
కార్మిక సమస్యలపై 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సీఐటీయూ ఆల్‌ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు.
పెనుకొండ, డిసెంబరు15(ఆంధ్రజ్యోతి): కార్మిక సమస్యలపై 31 నుంచి జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సీఐటీయూ ఆల్‌ఇండియా మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజు, రైతు సంఘం హరి ఆధ్వర్యంలో స్థానిక సంఘం కార్యాలయం, హమాలీ గోడౌన, మనిఇ్సపల్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేశారు. మహాసభలకు దేశవ్యాప్తంగా 200మంది డెలిగేట్స్ హాజరై కార్మిక సమస్యలపై చర్చలు జరిపి దిశానిర్దేశం చేస్తారన్నారు. బాబావలి, బావమ్మ, వెంకటేశ, నర్సింహప్రసాద్, జబ్బార్, సావిత్రమ్మ, నరసింహ పాల్గొన్నారు.
చిలమత్తూరు (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో 31న ప్రారంభమవుతున్న సీఐటీయూ అఖిల భారత మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం నాయకులు ప్రవీణ్, వెంకటేశులు అంగనవాడీ, పంచాయతీ, ఆటో కార్మికులతో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. శోభారాణి, శారద, గౌస్, రఫిక్, చలపతి పాల్గొన్నారు.