RDO: క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించండి
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:53 PM
సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహిస్తోందని ఇనచార్జి ఆర్‌డీవో ఆనంద్ కుమార్ అన్నారు. సోమవారం ఆర్‌డీవో కార్యాలయ ఆవరణలో రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు.
మడకశిరటౌన, జనవరి 5 (ఆంధ్రజ్యోతి): సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రెవెన్యూ క్లినిక్‌లను నిర్వహిస్తోందని ఇనచార్జి ఆర్‌డీవో ఆనంద్ కుమార్ అన్నారు. సోమవారం ఆర్‌డీవో కార్యాలయ ఆవరణలో రెవెన్యూ క్లినిక్ నిర్వహించారు. రైతులు 44 అర్జీలను అందించారు. అనంతరం ఆర్‌డీవో నియోజకవర్గంలోని తహసీల్దార్‌లు, ఆర్‌ఐలు, డీటీలు, వీఆర్‌ఓలతో సమావేశాన్ని నిర్వహించారు. అర్జీలకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ విషయాలను ఆరా తీయాలన్నారు. అన్ని మండలాల తహసీల్దార్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.
రొళ్ల(ఆంధ్రజ్యోతి): మండలంలోని రత్నగిరి గ్రామానికి చెందిన రైతు గౌమరమ్మ పట్టాదారు పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. రెవెన్యూ క్లీనిక్ ద్వారా వెంటనే సంబందిత రైతు 1బి మంజూరు అయినట్లు తహసీల్దార్ శెక్షావలి తెలిపారు. ఆర్డీఓ ఆనంద్‌కుమార్ చేతులమీదుగా సోమవారం పాసుపుస్తకం అందించారు.
భూసమస్యల పరిష్కార వేదిక.. రెవెన్యూ క్లినిక్
పెనుకొండ టౌన (ఆంధ్రజ్యోతి): రైతులకు చెందిన ఎన్నోఏళ్ల భూసమస్యల పరిష్కారం కోసం ఏర్పాటుచేసిన వేదికే రెవెన్యూ క్లినిక్ అని తహసీల్దార్ స్వాతి అన్నారు. సోమవారం స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో పెనుకొండ డివిజనకు చెందిన ఏడు మండలాల తహసీల్దార్‌లతో రెవెన్యూ క్లీనిక్ ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ వచ్చిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పట్టాదారు పాసుపుస్తకం, భూములకు దారి, సబ్‌డివిజన తదితర సమస్యలను పరిష్కరిస్తాన్నారు. అన్ని మండలాల తహసీల్దార్‌లు, అధికారులు పాల్గొన్నారు.