WOOD TRANSPORT: కలప అక్రమ రవాణాను అడ్డుకునేదెవరు?
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:51 PM
అక్రమంగా అటవీ ప్రాంతం నుంచి చెట్లను నరికి హైవేమీదుగా వాహనాల ద్వారా దర్జాగా తరలిస్తు న్నా అడ్డుకునే అధికారులు కరువయ్యారు. పచ్చనిచెట్లపై గొడ్డలివేటు ప డుతున్నా అటవీ అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తా విస్తోంది.
జాతీయ రహదారిపై యథేచ్ఛగా తరలింపు
పట్టించుకోని అటవీశాఖ అధికారులు
సోమందేపల్లి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): అక్రమంగా అటవీ ప్రాంతం నుంచి చెట్లను నరికి హైవేమీదుగా వాహనాల ద్వారా దర్జాగా తరలిస్తు న్నా అడ్డుకునే అధికారులు కరువయ్యారు. పచ్చనిచెట్లపై గొడ్డలివేటు ప డుతున్నా అటవీ అధికారులు పట్టించుకోకపోవడం పలు విమర్శలకు తా విస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం ఏటా ప్రభుత్వం కోట్లాదిరూపాయ లు ఖర్చుచేస్తోంది. వివిధ పథకాల ద్వారా నిధులను ప్రతి చెట్టు పెంపకంపై జాగ్రత్తలు తీసుకుంటుంటే మరోపక్క అక్రమార్కులు ధనార్జనే ధ్యే యంగా చెట్లను నరికి సొమ్ము చేసుకుంటున్నారు. సమీప అడవుల్లో, గ్రా మాల్లో వేప, తుమ్మ, చింత చెట్లను నరికేస్తున్నారు.
హైవేపై కలప పరుగులు
సోమందేపల్లి మండలానికి ఆనుకుని 9 కి.మీ మేర జాతీయరహదారి ఉంది. పెనుకొండ, సోమందేపల్లి మీదుగా ఇతర ప్రాంతాలకు కలప తరలిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు ఇటుక బట్టీలు, హోటళ్లకు లోడ్ రూ.10వేల నుంచి రూ.15వేల దాకా విక్రయిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా నరికి చెట్లు తెల్లవారుజామున అడ్డదారుల్లో పట్టణానికి తరలిస్తున్నారు. మంచి కలప మొద్దులను హిందూపురంలాంటి ప్రాంతాల్లో ఉన్న సామిల్లులకు తరలిస్తున్నట్లు సమాచారం. గృహనిర్మాణాలు ఊపందుకోవడంతో వేప, తుమ్మకు విపరీతమైన డిమాం డ్ పెరిగింది. దీంతో దుంగల సైజు, కర్రలను బట్టి లోడ్ రూ.20వేల నుంచి రూ.30వేల దాకా అమ్ముడుపోతున్నట్లు తెలిసింది.
కట్టడి చేస్తాం: శ్రీనివాసరెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓ
కలప అక్రమ రవాణా మా దృష్టికి రాలేదు. నిఘా పెడతాం. కలపతో వెళ్లే వాహనాల గురించి సమాచారం అందిస్తే వాటిని పూర్తీస్థాయిలో కట్టడి చేస్తాం. అనుమతులు లేకుండా చింతచెట్లు నరికితే వారిపై కేసులు నమోదు చేస్తాం.