DEPUTY DMHO: పోలియో చుక్కలు వేయించాలి
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:07 AM
నియోజకవర్గంలో 21వ తేదీన నిర్వహించే పోలియో చుక్కల కార్యక్రమంలో ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా చుక్కలు వేయించాలని డిప్యూటీ డీఎంహెచఓ డాక్టర్ మంజువాణి సూచించారు.
పెనుకొండ, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గంలో 21వ తేదీన నిర్వహించే పోలియో చుక్కల కార్యక్రమంలో ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా చుక్కలు వేయించాలని డిప్యూటీ డీఎంహెచఓ డాక్టర్ మంజువాణి సూచించారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమావేశ భవనంలో పోలియోచుక్కల కార్యక్రమం నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పుట్టిన ప్రతి బిడ్డకు ఐదేళ్లపాటు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. 21న ఆదివారం పట్టణంలో 16బూతలు ఏర్పాటుచేసి పిల్లలకు చుక్కల మందు వేయించాలన్నారు. ఆదివారం వేయించుకోని పిల్లలకు సోమ, మంగళవారాల్లో ఇంటివద్దకే వెళ్లి వేయాలన్నారు. డాక్టర్ రిహానాబేగం, సూపర్‌వైజర్లు చంద్రశేఖర్, జనార్దనరెడ్డి, ఆశ, అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
చిలమత్తూరు(ఆంధ్రజ్యోతి): పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని డాక్టర్లు లావణ్య, నికేష్ అన్నారు. 21వ తతేదదీన పల్స్‌పోలియో కార్యక్రమం చేపడుతున్నామన్నారు. మండల వ్యాప్తంగా 3721మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మండల వ్యాప్తంగా 9 రూట్లుగా విభజించి 82 బూతలు, రెండు బ్రాండ్‌సిట్ బూతలు, ఒక మొబైల్ బూతను ఏర్పాటుచేసినట్లు తెలిపారు.