Share News

MARKET : వారపు సంత కోసం వ్యాపారుల పాట్లు

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:06 AM

మండల కేంద్రంలో 25ఏళ్ల క్రితం జనాభా తక్కువ ఉన్న సమయంలో వారపుసంతను రోడ్డుపై నిర్వహించేవారు. రాను రాను పట్టణం విస్తరించింది. మేజర్‌ పంచాయతీలో 20వేలకుపైగా జనాభా ఉంది. నేటికీ పాతూరుకు వెళే ్లదారిలోనే వారపుసంత నిర్వహిస్తున్నట్లు వ్యాపారులు అంటున్నారు.

MARKET : వారపు సంత కోసం వ్యాపారుల పాట్లు
రోడ్డుపై నిర్వహిస్తున్న సంత

తరచూ ట్రాఫిక్‌ జామ్‌తో ప్రజల ఇబ్బందులు

పట్టించుకోని పంచాయతీ అధికారులు

సోమందేపల్లి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో 25ఏళ్ల క్రితం జనాభా తక్కువ ఉన్న సమయంలో వారపుసంతను రోడ్డుపై నిర్వహించేవారు. రాను రాను పట్టణం విస్తరించింది. మేజర్‌ పంచాయతీలో 20వేలకుపైగా జనాభా ఉంది. నేటికీ పాతూరుకు వెళే ్లదారిలోనే వారపుసంత నిర్వహిస్తున్నట్లు వ్యాపారులు అంటున్నారు. దుకాణాలకు స్థలంలేక రోడ్లపైకి వచ్చేశాయి. ప్రతివారం నిర్వహించే సంతలో 600దుకాణాలు ఏర్పాటు చేస్తారు. చిన్న, పెద్ద దుకాణాలు, ఆటోలు, గంపలు, తోపుడుబండ్లు రోడ్డుకు ఇరువైపులా పెడుతుండటంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాల్మీకి సర్కిల్‌ నుంచి పంచాయతీ కార్యాలయంగుండా ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. ఇదిలా ఉంటే వాల్మీకి సర్కిల్‌లో మద్యం దుకాణం నిర్వహిస్తున్నారు. గురువారం మందుబాబుల తాకిడి అధికంగా ఉంటుంది. మద్యం దుకాణం ముందుకూడా కూరగాయల దుకాణాలు ఏర్పాటు చేయడం ద్వారా మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఇనచార్జి ఎంపీడీఓ ప్రేమ్‌కుమార్‌ దీనిపై దృష్టిసారించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలుతీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Dec 30 , 2025 | 12:06 AM