Share News

Minister Savitha: అపరభగీరథుడు చంద్రబాబు.. అతిపెద్ద దొంగ జగన్‌

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:43 PM

రాష్ట్రమంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అపరభగీరథుడు సీఎం చంద్రబాబునాయుడు.. అతిపెద్ద దొంగ జగన్‌ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీసీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే..

Minister Savitha: అపరభగీరథుడు చంద్రబాబు.. అతిపెద్ద దొంగ జగన్‌

- ఎన్ని బెదిరింపులకు దిగినా అమరావతి నిర్మించి తీరుతాం

- బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత

పెనుకొండ(అనంతపురం): సీఎం చంద్రబాబు అపరభగీరథుడని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత(Minister Savitha) అన్నారు. జగన్‌ అతిపెద్ద దొంగ అని మండిపడ్డారు. పెనుకొండలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్‌ అన్ని వ్యవస్థలను నాశనం చేసి, వేలకోట్లు దోచుకున్న అతిపెద్ద దొంగ అని విమర్శించారు. రాయలసీమకు తీరని ద్రోహం చేసిన ఆయన, దయ్యాలు వేదాలు వల్లించినట్లు కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని అన్నారు.


తాడేపల్లిలో ఇంటిని నిర్మించుకుని అమరావతే రాజధాని అని అక్కడి ప్రజలను నమ్మించారని, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారని విమర్శించారు. ఐదేళ్లపాటు రాజధాని లేకుండా పాలించిన ఘనుడు జగన్‌ అని ఎద్దేవా చేశారు. ప్రజాధనాన్ని దోచుకోవడానికి రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ పేరుతో జగన్‌ పెద్ద కుట్రకు తెరలేపారని అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ పనులను కాంట్రాక్టు సంస్థకు అప్పగించారని, రూ.900 కోట్లు ఖర్చుచేశారని అన్నారు. ఎత్తిపోతల పథకం పేరుతో రూ.2,745 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు.


pandu3.2.jpg

అక్రమార్జన కోసం రాయలసీమకు, రాష్ట్ర ప్రజలకు జగన్‌ తీరని ద్రోహం చేశారని అన్నారు. రాయలసీమపై జగన్‌కు నిజమైన ప్రేమ ఉంటే 18 నెలల నుంచి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ఇన్నాళ్లు ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసం తెలంగాణ రాజకీయ పార్టీలు సీఎం చంద్రబాబు పేరును వాడుకుంటున్నాయని, జగన్‌ తప్పుడు ఆరోపణలతో విషం కక్కుతున్నారని మంత్రి మండిపడ్డారు. రాయలసీమకు తాగు, సాగునీరు అందించిన ఘనత సీఎం చంద్రబాబుదేనని అన్నారు. ఎన్ని బెదిరింపులకు పాల్పడినా అమరావతిని నిర్మించి తీరుతామని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

ప్రతి ఏటా పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌

దావోస్‌‌లో తెలంగాణ రైజింగ్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 10 , 2026 | 12:43 PM