Share News

AP News: టీడీపీ నేతల ఫైర్‌.. దందాలు, దౌర్జన్యాలు వేణురెడ్డికే చెల్లు

ABN , Publish Date - Jan 20 , 2026 | 11:06 AM

దందాలు, దౌర్జన్యాలు వైసీపీ నాయకుడు వేణురెడ్డికే చెల్లుబాటు అవుతుందని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు వారు విలేకరులతో మాట్లాడుతూ... హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నేతలు ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారో ఇక్కడి ప్రజలకు అన్నీ తెలుసన్నారు.

AP News: టీడీపీ నేతల ఫైర్‌.. దందాలు, దౌర్జన్యాలు వేణురెడ్డికే చెల్లు

హిందూపురం(అనంతపురం): హిందూపురం నియోజకవర్గంలో దందాలు, దౌర్జన్యాలు చేయడం వైసీపీ నాయకుడు వేణురెడ్డి(Venu Reddy)కే చెల్లుతుందని గతంలో నియోజకవర్గ పరిధిలో చూశారంటూ టీడీపీ(TDP) నాయకులు ఆరోపించారు. వైసీపీ పురం ఇన్‌చార్జి దీపిక భర్త వేణురెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే, వ్యక్తిగత కార్యదర్శులు టీడీపీ నాయకులపై ఆరోపణలు చేశారు. సూగూరు చెరువుకు గండి కొట్టారన్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వేణురెడ్డి మాటలను ఖండించారు.


సూగూరు చెరువుకు గండికొట్టలేదని సూరప్పకుంటకు నీరు రావాలంటే మరువపక్కన కాలువ తీశారని అది అధికారుల సమక్షంలో జరిగిందన్నారు. గత ఐదేళ్ల వైసీపీ హయాంలో ఒక్క చెరువుకు చుక్కనీరు ఇవ్వని ఆ పార్టీ నాయకులు ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. దీపిక ఇన్‌చార్జి అయిన తరువాత వేణురెడ్డి పెన్నానదిని లూటీ చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. వంద టిప్పర్లు పెట్టి ఇసుకను కర్ణాటకకు తరలించింది ఎవరని నిలదీశారు.


pandu2.jpgఎమ్మెల్యేకాని, ఆయన వ్యక్తిగత కార్యదర్శులు కాని ఎక్కడైనా అవినీతికి పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజకీయంగా దూరంగా ఉంటామని టీడీపీ నాయకులు అన్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ రమేష్‌, టీడీపీ పట్టణాధ్యక్షుడు వెంకటేశ్‌, నాయకులు నాగరాజు, లీగల్‌సెల్‌ జిల్లా అధ్యక్షులు కొల్లకుంట శివశంకర్‌, మోదాశివ తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

భారీ పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా..

ఏపీలో స్విస్‌ పెట్టుబడులకు సహకరించండి

Read Latest Telangana News and National News

Updated Date - Jan 20 , 2026 | 11:06 AM