Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 4 కొత్త వందే భారత్ రైళ్లు!
ABN , Publish Date - Nov 03 , 2025 | 09:19 PM
దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేసే విధంగా ఇండియన్ రైల్వే శాఖ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నాలుగు కొత్త వందే భారత్ రైళ్ల నిర్వహణకు ఆమోదం తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది రైళ్లలో జర్నీ చేయడానికి ఇష్టపడుతుంటారు. బస్సు జర్నీలతో పోలిస్తే.. ఖర్చు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు రైళ్లపై ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. రైల్వే శాఖ అనేక సదపాయాలు, సౌకర్యాలను కల్పిస్తుంది. అంతేకాక వివిధ రకాల రైళ్లను అందుబాటులోకి తెచ్చి.. ట్రైన్ జర్నీని ఎంతో సౌకర్యవంతంగా మారుస్తుంది. ఈ క్రమంలోనే వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు వందే భారత్ రైళ్ల(Vande Bharat Express)ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా అనేక మార్గాల్లో ఈ రైలు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రయాణికులు రైల్వే శాఖ(Indian Railway) ఓ సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
దేశవ్యాప్తంగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్(Vande Bharat Express) విస్తరణను వేగవంతం చేసే విధంగా ఇండియన్ రైల్వే శాఖ అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో తాజాగా నాలుగు కొత్త వందే భారత్ రైళ్ల నిర్వహణకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ రైళ్ల ప్రయాణం రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయడమే కాకుండా, ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందనుంది. కొత్తగా రానున్న 4 రైళ్లతో కలిపి దేశంలో మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 164కి చేరుతుంది. ఈ నాలుగు కొత్త రైలు నాలుగు మార్గంలో పరుగులు పెట్టనున్నాయి. రైల్వే అధికారుల ప్రకారం.. బెంగళూరు (KSR) – ఎర్నాకులం(Bengaluru- Ernakulam), రెండోవది ఫిరోజ్‌పూర్ కాంట్-ఢిల్లీ, మూడోవది వారణాసి-ఖజురహో, లక్నో-సహరన్‌పూర్ మధ్య పరుగులు పెట్టనున్నాయి.
బెంగళూరు– ఎర్నాకులం మధ్య నడిచే వందే భారత్ రైలు కర్ణాటక- కేరళ మధ్య ప్రయాణాన్ని వేగవంతం, సులభతరం చేస్తుంది. అలానే ఫిరోజ్‌పూర్ కాంట్-ఢిల్లీ మధ్య నడిచే ట్రైన్ పంజాబ్‌ను దేశ రాజధాని ఢిల్లీతో కలుపుతుంది. వారణాసి-ఖజురహో( Varanasi Khajuraho) వందే భారత్ రైలు ఉత్తరప్రదేశ్- మధ్యప్రదేశ్ మధ్య పర్యాటక, వ్యాపార ప్రయాణాన్ని పెంచుతుంది. లక్నో-సహరన్‌పూర్(Lucknow Saharanpur) మధ్య పరుగులు పెట్టే వందే భారత్.. ఉత్తరప్రదేశ్ లోని వాయువ్య దిశగా కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.
ఇవి కూడా చదవండి..
అడగడానికి ఇంకేమీ ప్రశ్నలు లేవా... నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య
ఉద్యోగమిప్పించమని వచ్చి.. ఎమ్మెల్యేని కుళ్లబొడిచేశాడు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి