Karur Stampede: విజయ్ కార్యాలయానికి సీబీఐ.. కరూర్ తొక్కిసలాటపై ఆరా
ABN , Publish Date - Nov 03 , 2025 | 08:48 PM
టీవీకే అధ్యక్షుడు విజయ్ అక్టోబర్ 27న కరూర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు.
చెన్నై: తమిళనాడులోని కరూర్‌లో తమిళగ వెట్రి కళంగం (TVK) చీఫ్ విజయ్ ఇటీవల నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాటకు సంబంధించి సీబీఐ (CBI) అధికారులు సోమవారంనాడు టీవీకే పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. ఈ విషయాన్ని టీవీకే జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ ధ్రువీకరించారు. కనూర్ తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వంటి వివరాలను అడిగినట్టు తెలిపారు.
'అధికారులు వివరాల కోసం వచ్చారు, ఇంటరాగేషన్ కోసం కాదు. వ్యక్తిగతంగా సమన్లు జారీ చేసి వివరాలు ఇవ్వాలని కోరారు. మా ప్రతినిధుల ద్వారా మూడు నాలుగు రోజుల్లో ఆ వివరాలు అందజేసేందుకు మేము అంగీకరించాం' అని చెప్పారు. దర్యాప్తు కోసం తొలుత ఏర్పాటు చేసిన 'సిట్'కు ఇప్పటికే తాము సంబంధిత వివరాలను అందించినట్టు ఆయన తెలిపారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించి ఎప్పుడు సాక్ష్యం ఇమ్మని అడిగినా సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు కుమార్ తెలిపారు.
కరూర్ ఘటన వివరాలు
టీవీకే అధ్యక్షుడు విజయ్ సెప్టెంబర్ 27న కరూర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకుని 41 మంది మృతి చెందగా, 60 మందికి పైగా గాయపడ్డారు. హైకోర్టు ఆదేశాలతో ఈ ఘటనపై సిట్ దర్యాప్తు చేపట్టింది. అయితే సిట్‌పై తమకు నమ్మకం లేదని, సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టులో టీవీకే పిటిషన్ వేసింది. దీంతో దర్యాప్తు బాధ్యతను సీబీఐకి బదిలీ చేస్తూ అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది.
ఇవి కూడా చదవండి..
అడగడానికి ఇంకేమీ ప్రశ్నలు లేవా... నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య
ఎస్ఐఆర్‌పై సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి