Tamil Nadu SIR: ఎస్ఐఆర్‌పై సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్
ABN , Publish Date - Nov 03 , 2025 | 08:04 PM
తమిళనాడు ప్రజల ఓటు హక్కులను లాక్కుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు హడావిడిగా ఎస్ఐఆర్‍ను అమలు చేయాలనుకుంటున్నారని, దీనికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఐక్యంగా తమ గొంతు వినిపించాల్సి ఉందని సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్టాలిన్ తెలిపారు.
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ప్రకటించిన రెండో విడత ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే (DMK) సుప్రీంకోర్టు (Supreme Court)లో సోమవారంనాడు పిటిషన్ వేసింది. డీఎంకే ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆర్ఎస్ భారతి ఈ పిటిషన్‌ను డీఎంకే ఎంపీ, సీనియర్ అడ్వకేట్ ఎన్ఆర్ ఇలాంగో ద్వారా సుప్రీంకోర్టులో వేశారు. తమిళనాడులో ఎస్ఐఆర్ నిర్వహిస్తామంటూ అక్టోబర్ 27న ఈసీఐ ఇచ్చిన నోటిఫికేషన్‌ను కొట్టి వేయాలని ఆ పిటిషన్‌లో కోరారు.
ఎస్ఐఆర్‌పై అఖిల పక్ష సమావేశం
తమిళనాడు సహా పన్నెండు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈసీ ప్రతిపాదత ఓటర్ల జాబితా సవరణపై సుప్రీంకోర్టుకు వెళ్లే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఎంకే స్టాలిన్ ఆదివారంనాడు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం సుప్రీంకోర్టుకు వెళ్లాలనే నిర్ణయాన్ని సమావేశంలో తీసుకున్నారు. తమిళనాడు ప్రజల ఓటు హక్కులను లాక్కుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు హడావిడిగా ఎస్ఐఆర్‍ను అమలు చేయాలనుకుంటున్నారని, దీనికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఐక్యంగా తమ గొంతు వినిపించాల్సి ఉంటుందని స్టాలిన్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు. 2026 సార్వత్రిక ఎన్నికల తర్వాత చాలినంత వ్యవధి ఉన్నప్పటికీ ఆ పని చేయకపోవడంతో ఓటర్ల జాబితాపై పలు అనుమానాలు, గందరగోళం ఉందన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని అఖిల పక్ష సమావేశం తీర్మానం చేసినట్టు చెప్పారు.
అఖిలపక్ష సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించిన 49 పార్టీలకు స్టాలిన్ కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశానికి హాజరు కాని పార్టీలు సైతం తమలో తాము చర్చించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు చొరవ తీసుకోవాలని కోరారు.
ఇవి కూడా చదవండి..
అడగడానికి ఇంకేమీ ప్రశ్నలు లేవా... నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య
ఉద్యోగమిప్పించమని వచ్చి.. ఎమ్మెల్యేని కుళ్లబొడిచేశాడు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి