Siddaramaiah: అడగడానికి ఇంకేమీ ప్రశ్నలు లేవా... నాయకత్వ మార్పుపై సిద్ధరామయ్య
ABN , Publish Date - Nov 03 , 2025 | 02:49 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ఐదున్నరేళ్ల పాలనలో రెండున్నరేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు జరగవచ్చని కొందరు ఊహాగానాలు చేస్తుండగా, కొందరు ఈ పరిణామాలను 'నవంబర్ రివల్యూషన్'గా పిలుస్తున్నారు.
బెంగళూరు: కర్ణాటకలో నాయకత్వ మార్పు అవకాశాలపై మీడియా అడిగి ప్రశ్నకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) సోమవారంనాడు ఘాటుగా స్పందించారు. 'మీరు ప్రతిసారి దీని గురించే ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు ఆ ప్రశ్న అడగాల్సిన పనేముంది? అధిష్ఠానం కాకుండా ఎవరు ఏమి మాట్లాడినా దానికి అంతగా ప్రాధాన్యత ఉండదు' అని సమాధానమిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఐదున్నరేళ్ల పాలనలో రెండున్నరేళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు జరగవచ్చని కొందరు ఊహాగానాలు చేస్తుండగా, కొందరు ఈ పరిణామాలను 'నవంబర్ రివల్యూషన్'గా పిలుస్తున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.
హైకమాండ్ ఏదైనా చెప్పిందా అని సీఎంను మీడియా తాజాగా ప్రశ్నించగా ఆయన సూటిగా స్పందించారు. ప్రజలు ఏదో ఒకటి చెబుతుంటారని, వారి మాటలు పట్టించుకోవాల్సి అవసరం లేదని అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే దీనిపై ఏమైనా చెప్పారా? వారు ఏదైనా చెబితేనే దాని గురించి ప్రశ్నించాలని సూచించారు.
మంత్రివర్గ పునర్వవస్థీకరణపై..
బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్ర మంత్రివర్గ పునర్వవస్థీకరణపై పార్టీ హైకమాండ్‌తో మాట్లాడతానని సిద్ధరామయ్య చెప్పారు. నవంబర్ 6,11 తేదీల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నారు. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి. ఆ మరుసటి రోజు కాంగ్రెస్ అగ్రనేతలను సిద్ధరామయ్య కలుసుకోనున్నారు.
ఇవి కూడా చదవండి..
బార్క్ నకిలీ శాస్త్రవేత్త కేసు.. నిందితుడికి ఐఎస్ఐతో సంబంధాలు
ఉద్యోగమిప్పించమని వచ్చి.. ఎమ్మెల్యేని కుళ్లబొడిచేశాడు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి