Share News

Sahasra Lingarchana in Oman: గల్ఫ్‌లో శివనామస్మరణ

ABN , Publish Date - Nov 03 , 2025 | 05:05 AM

ఎక్కడో అరేబియా సముద్ర తీరాన ఉన్న గల్ఫ్‌ దేశం ఒమాన్‌.. కార్తీక మాస ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శివనామస్మరణతో మార్మోగిపోయింది. ఒమాన్‌లోని తెలుగు ప్రవాసీయులు...

Sahasra Lingarchana in Oman: గల్ఫ్‌లో శివనామస్మరణ

  • ఒమాన్‌లో వైభవంగా సహస్ర లింగార్చన

ఎక్కడో అరేబియా సముద్ర తీరాన ఉన్న గల్ఫ్‌ దేశం ఒమాన్‌.. కార్తీక మాస ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శివనామస్మరణతో మార్మోగిపోయింది. ఒమాన్‌లోని తెలుగు ప్రవాసీయులు, చిరు మెగా యూత్‌ ఫోర్స్‌ ఆధ్వర్యంలో మస్కట్‌ శివారులో శుక్రవారం సహస్ర లింగార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. స్థానిక వేద పండితులు ధర్మపురి విజయకుమార్‌ ఆధ్వర్యంలో మట్టితో తయారు చేసిన 1,115 శివ లింగాలకు ఈ కార్యక్రమంలో రుద్రాభిషేకం నిర్వహించారు. ఒమాన్‌, పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు ప్రవాసీయులతోపాటు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ప్రవచనకర్త డాక్టర్‌ అనంత లక్ష్మి, సికింద్రాబాద్‌ మహంకాళీ డివిజన్‌ అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్‌ సైదయ్య ఈ సహస్ర లింగార్చనలో పాల్గొన్నారు. భారతీయ పండుగలు, సంస్కృతి విదేశీ గడ్డపై భారతీయులను ఐక్యం చేసేందుకు ఉపకరిస్తున్నాయని ఒమన్‌లో భారత రాయబారి జీవీ శ్రీనివాస్‌ అన్నారు. ఒమాన్‌లో జరిగిన ఈ సహస్ర లింగార్చనలో పాల్గొన్న ప్రవాసీయులను చూస్తే తనకు సికింద్రాబాద్‌ మహంకాళి దేవస్థానంలో జరిగే బోనాల పండుగ గుర్తుకు వచ్చిందని సైదయ్య అన్నారు.

Updated Date - Nov 03 , 2025 | 05:05 AM