Share News

Vande Bharat train: హిందూపూర్‌ ఏరియా వాసులకో గుడ్ న్యూస్.. అదేంటో తెలిస్తే..

ABN , Publish Date - Aug 20 , 2025 | 09:38 AM

నగరం నుంచి హిందూపూర్‌ వెళ్లే ప్రయాణికులకు శుభావార్త చెప్పారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న. కాచిగూడ రైల్వేస్టేషన్‌ నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్లే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (20703) హిందూపూర్‌లో ఆగుతుందని(హాల్టింగ్‌) ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Vande Bharat train: హిందూపూర్‌ ఏరియా వాసులకో గుడ్ న్యూస్.. అదేంటో తెలిస్తే..

- హిందూపూర్‌లో ‘వందే భారత్‌’ హాల్టింగ్‌

సికింద్రాబాద్: నగరం నుంచి హిందూపూర్‌(Hindupur) వెళ్లే ప్రయాణికులకు శుభావార్త చెప్పారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న. కాచిగూడ రైల్వేస్టేషన్‌(Kacheguda Railway Station) నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్లే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు (20703) హిందూపూర్‌లో ఆగుతుందని(హాల్టింగ్‌) ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఉదయం 5.45గంటలకు బయల్దేరి మహబూబ్‌నగర్‌(Mahabubnagar)కు 6.54 గంటలకు, కర్నూలుకు 8.28 గంటలకు,


city6.jpg

అనంతపూర్‌కు 10.43 గంటలకు, ధర్మవరం(Dharmavaram)కు 11.10 గంటలకు చేరుతుంది. హిందూపూర్‌కు ఉదయం 11.40 గంటలకు చేరే అవకాశం ఉంటుంది. ఈ రైలు యశ్వంత్‌పూర్‌(Yeshwantpur)కు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 2.45 గంటలకు బయల్దేరి రాత్రి 11 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. ఏ తేదీ నుంచి వందే భారత్‌ రైలు హిందూపూర్‌లో ఆగుతుందో దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...

‘కన్ఫర్డ్‌’లుగా 17 మంది సిఫారసు!

విద్యుత్‌ స్తంభాలపై కేబుల్‌ వైర్లను తీసేయండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 20 , 2025 | 09:38 AM